సినిమా ఇండస్ట్రీలో బ్యాచిలర్ అంటే మొదట సల్మాన్ ఖాన్ గుర్తుకు వచ్చేవాడు. అయితే 56 ఏళ్ళు ఉన్న సల్మాన్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అతడిని ఇప్పుడు ఆ పెళ్లి గురించి అడగటం కూడా చాలామంది మానేశారు. ఇక ఇప్పుడు అందరూ ప్రభాస్ మీద పడ్డారు అనే చెప్పాలి. అయితే 2016 ముందు టాలీవుడ్ వరకే పరిమితం అయిన ప్రభాస్ ఆ తర్వాత వచ్చిన బాహుబలి తర్వాత పాన్ ఇండియా హీరో అయ్యాడు.
Advertisement
అయితే ఇప్పుడు 42 ఏళ్ళు ఉన్న ప్రభాస్ కూడా ఇంకా పెళ్లి అనేది చేసుకోలేదు. అందుకే అందరూ ప్రభాస్ ను పెళ్లి గురించి ప్రశ్నిస్తారు. ఇక సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ పెళ్లి గురించి రకరకాల పుకార్లు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ప్రభాస్ పెళ్లిపై తన తల్లి చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అందులో ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి రవి అనే అతని ఫ్రెండ్ కారనమాట.
Advertisement
ప్రభాస్ తల్లి తన సన్నిహితులతో ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ ఏడ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రభాస్ కు రవి అనే ఓ స్నేహితుడు ఉన్నాడు. అతని వల్లే ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు అని చెప్పిందట. ఆ రవి ప్రేమలో విఫలం అయ్యి 45 ఏళ్ళు వచ్చిన ఇంకా పెళ్లి చేసుకోలేదు అని… ఇక తన లవ్ ఫెల్యూర్ గురించి ఎక్కువగా ప్రభాస్ కు అతను చెప్పడంతోనే.. ప్రభాస్ పెళ్లి గురించి ఆలోచించడం లేదు ప్రభాస్ తల్లి పేర్కొన్నట్లు తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :