Home » Prabhas : అఖిల్ పై రూ. 100 కోట్లు పెట్టుబడి పెడుతున్న ప్రభాస్ !

Prabhas : అఖిల్ పై రూ. 100 కోట్లు పెట్టుబడి పెడుతున్న ప్రభాస్ !

by Bunty

అక్కినేని వారసుడు అఖిల్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తన అందానికి, హాట్ నెస్ కి ఎంతోమంది అమ్మాయిలు క్యూ కడుతున్నారు. ఇక సినిమాల ఫలితం ఎలా ఉన్నా కూడా అఖిల్ కి మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇప్పటివరకు తన కెరీర్ లో ఒక్క హిట్ సినిమా కూడా లేకపోవడం నిజంగా బాధాకరం. సినిమాల పరంగా తనకు ఏ రకంగా లక్ కలిసి రావడం లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఏజెంట్ సినిమా డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. 80 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఏజెంట్ సినిమాకి 10 కోట్ల కలెక్షన్స్ కూడా రాలేదు. దీంతో అందరూ షాక్ కి గురయ్యారు.

Prabhas investing on akhil movie

Prabhas investing on akhil movie

అంతేకాకుండా ఓటిటిలో కూడా ఈ సినిమా వివాదంలో చిక్కుకొని ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. ఆ బాధలో ఉన్న అఖిల్ ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేకపోయాడు. ఏజెంట్ సినిమా విడుదల అయ్యి ఆరు నెలలు పూర్తి అయింది. కానీ ఇప్పటివరకు అఖిల్ ఎలాంటి సినిమాలు చేయలేదు. ఏజెంట్ ఫ్లాప్ ను మర్చిపోయి మరో సినిమాతో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో అఖిల్ తదుపరిచిత్రం ఉండబోతుందట. అనిల్ కుమార్ అనే కొత్త డైరెక్టర్ కి అఖిల్ ఛాన్స్ ఇచ్చాడట. ఇక ఈ సినిమాకి ఏకంగా 100 కోట్ల బడ్జెట్ ని కేటాయిస్తున్నారు.

Akhil Akkineni marriage fix

Akhil Akkineni

కొత్త డైరెక్టర్, ఫ్లాప్ హీరో అయినప్పటికీ ప్రభాస్ హోమ్ బ్యానర్ యువి క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని రూపొందించబోతున్నారు. ఇక ఈ సినిమా విషయంలో అఖిల్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. నాగార్జున సైతం అఖిల్ పక్కనే ఉండి ఈ సినిమాని చేపిస్తున్నారట. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ నాగార్జున తన కొడుకు కోసం జాగ్రత్తపడి ఈ నిర్ణయం తీసుకున్నారట. ఫిబ్రవరి లేదా మార్చ్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. 2025లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading