Home » షూటింగ్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రభాస్ గారి నుండి భోజనం వచ్చేది… జబర్దస్త్ మహేష్..!

షూటింగ్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రభాస్ గారి నుండి భోజనం వచ్చేది… జబర్దస్త్ మహేష్..!

by AJAY
Ad

ప్రముఖ టీవీ షోలలో ఒకటి అయినటువంటి జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం వరుస సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న జబర్దస్త్ మహేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. షకలక శంకర్ టీం ద్వారా జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ ఈ షోలో తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు.

Advertisement

ఆ తర్వాత కొన్ని సినిమాలలో అవకాశాలను దక్కించుకున్న ఈ నటుడు 2018వ సంవత్సరం విడుదల అయినటువంటి రంగస్థలం మూవీ ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మూవీ తర్వాత మహేష్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న ఎన్నో సినిమాలలో అవకాశాలు దక్కాయి. అదే విధంగా ప్రస్తుతం కూడా మహేష్ ఎన్నో భారీ క్రేజ్ ఉన్న సినిమాల్లో నటిస్తున్నాడు.

Advertisement

ప్రస్తుతం మహేష్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్… ప్రభాస్… మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ గురించి… అలాగే ప్రభాస్ వ్యక్తిత్వం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా మహేష్ మాట్లాడుతూ … మారుతి మూవీలో ప్రభాస్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నాడు అని… చెక్స్ షర్ట్స్ వేసుకొని లవర్ బాయ్ లుక్ లో కనిపించనున్నాడు అని… అలాగే ఈ సినిమాలో డార్లింగ్… మిస్టర్ పర్ఫెక్ట్ ఎనర్జీ ప్రభాస్ లో కనిపిస్తుంది అని మహేష్ చెప్పుకొచ్చాడు.

అలాగే ప్రభాస్ సినిమా షూటింగ్లో 200 మంది ఉంటే 200 మందికి… 300 మంది ఉంటే 300 మందికి ఆయన తరపు నుండి భోజనం వచ్చేస్తుంది. నేను మటన్ బాగా తిన్నాను. ఏం నచ్చింది రా అని అడిగారు. మటన్ అన్న అనగానే… రేపు పొద్దున మహేష్ కు మటన్ తెప్పించండి అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన ఇంటిలో వండించి పంపించారు అని మహేష్ చెప్పుకొచ్చాడు.

Visitors Are Also Reading