Home » మహేష్ బాబు చెప్పడం వల్లే… ప్రభాస్ కి ఆ హిట్ సినిమాలో ఛాన్స్..!

మహేష్ బాబు చెప్పడం వల్లే… ప్రభాస్ కి ఆ హిట్ సినిమాలో ఛాన్స్..!

by Sravya
Ad

దర్శకులు చెప్పిన ప్రతి కథని కూడా హీరోలు ఒప్పుకోరు. హీరో వాళ్లకి కథ నచ్చితే తప్ప సినిమా చేయడానికి ఇష్టపడరు. సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు వాళ్ల దగ్గరికి వచ్చిన కథల్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలా రిజెక్ట్ చేయకపోతే కచ్చితంగా హిట్లు రావు. పైగా కొంతమందికి కొన్ని కథల మీద ఇంట్రెస్ట్ ఉంటే కొంత మంది అటువంటి కథల్ని చేయడానికి ఇష్టపడరు. ఇలా ఎవరి ఛాయిస్ లు వాళ్ళవి. ఇలా ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది. కొన్ని కథలు సెట్ అవ్వక వాటిని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ కథని దర్శకుడు ఇంకో హీరోకి చెప్పి ఆ హీరోకి నచ్చితే సినిమా చేస్తాడు.

Prabhas-and-Mahesh

Advertisement

 

అయితే ఒకళ్ళ దగ్గరికి వచ్చిన స్టోరీ సెట్ కాకపోతే మరో హీరోకి బాగా సెట్ అవుతుందని సజెస్ట్ చేస్తూ ఉంటారు హీరోలు. మహేష్ బాబు కూడా అలాంటి హీరోనే ఇదివరకు ప్రొడ్యూసర్ దిల్ రాజు మహేష్ బాబు దగ్గరికి వచ్చి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కథని చెప్పారట. ఈ సినిమా కథ విన్న మహేష్ బాబు సినిమాకి నేను సెట్ అవ్వను. అయితే ఈ సినిమాకి ప్రభాస్ చాలా అద్భుతంగా ఉంటుందని ప్రభాస్ ఐతే ఈ సినిమాకి సెట్ అవుతాడని సజెస్ట్ చేశాడు మహేష్ బాబు. దీంతో దర్శకుడు తో కలిసి దిల్ రాజు ప్రభాస్ ని అప్రోచ్ అయ్యారు. కథని చెప్పారు. ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమాని తెరమీదకి తీసుకువచ్చారు.

Advertisement

మహేష్ కేవలం దర్శకుడికి ప్రొడ్యూసర్ కి చెప్పడమే కాదు ప్రభాస్ కి కూడా ఫోన్ చేసి మరీ ఒక కథ వచ్చింది అది కచ్చితంగా మీకు బాగా సెట్ అవుతుందని చెప్పారట. అలానే ఈ సినిమాని తప్పకుండా మీరు చేయండి అని సలహా ఇచ్చారట. మిస్ పర్ఫెక్ట్ కథ విన్న ప్రభాస్ కి స్టోరీ చాలా నచ్చింది దీంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాజల్ అగర్వాల్, తాప్సి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు ప్రస్తుతం మహేష్ బాబు కారణంగా ప్రభాస్ ఖాతాలో ఇలాంటి మంచి హిట్ చేరింది అన్న న్యూస్ వైరల్ అవుతోంది. డార్లింగ్ ఫాన్స్ మహేష్ బాబు ఈ సినిమా కథని ప్రభాస్ కి చెప్పారని తెలియడంతో మహేష్ బాబుని ప్రశంసిస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading