Home » సూపర్ స్టార్ మహేష్ బాబు మరో మల్టీప్లెక్స్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు మరో మల్టీప్లెక్స్..!

by Sravya
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. మహేష్ బాబు సినిమాలతో బిజీగా ఉన్నారు. అలానే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నారు. కనుక ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్ లో పెట్టుకున్నారు మహేష్ ఫ్యాన్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక పక్క హీరోగా చేస్తూ ఇంకో పక్క నిర్మాతగా మారి మీడియం రేంజ్ కథలను సిల్వర్ స్క్రీన్ మీదకి తీసుకు వచ్చే ప్రయత్నంలో ఉన్నారు. థియేటర్స్ వ్యాపారం లోకి కూడా అడుగుపెట్టారు మహేష్ బాబు. ఇప్పటికే గచ్చిబౌలి లో ఏఎంబి మాల్ నడుస్తోంది. హైదరాబాద్లో హైయెస్ట్ టికెట్ ధరలు ఉండేది ఈ మల్టీప్లెక్స్ థియేటర్లలోనే.

Advertisement

ఏషియన్ సినిమా వారి తో కలిసి ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి మహేష్ బాబు అడుగు పెట్టారు. ఏఎంబి మాల్ సక్సెస్ఫుల్గా నడుస్తోంది. హైదరాబాద్లో మరో థియేటర్ తీసుకురావాలని మహేష్ బాబు చూస్తున్నారు. హైదరాబాద్లో సుదర్శన్ 70 ఎంఎం అంటే తెలియని వాళ్ళు ఉండరు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు ఎక్కువగా సక్సెస్ వేడుకలు ఇక్కడ జరుపుకున్నాయి. ఈ థియేటర్ కి చరిత్ర కూడా ఎక్కువ ఉంది.

Advertisement

సుదర్శన్ 70ఎంఎం థియేటర్ ని నడపలేక క్లోజ్ చేసేసారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తనని తీసుకుని ఏషియన్ వారితో మల్టీప్లెక్స్ ని అభివృద్ధి చేశారు. మహేష్ బాబుకి ఇది రెండవ మల్టీప్లెక్స్. ఏఎంబీ క్లాసిక్ సుదర్శన్ 70 ఎంఎం పేరుతో ఈ మల్టీప్లెక్స్ని స్టార్ట్ చేయబోతున్నారు ఏఎంబీ క్లాసిక్ లో మొత్తం సెవెన్ స్క్రీన్స్ ఉంటాయి. గతంలో సుదర్శన్ లో సింగిల్ స్క్రీన్ లోనే మూవీ చూసేవారు. ఇప్పుడు ఏకంగా ఏడు స్క్రీన్స్ ని పెడుతున్నారు. అయితే త్వరలో ఇది రానుంది. కానీ ఎప్పుడు అనేది అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. ఏషియన్ సినిమాస్ జాయింట్ వెంచర్స్ గా మల్టీప్లెక్స్ చైన్స్ ని బిల్డ్ చేస్తోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading