Home » కేజీఎఫ్-2 ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా ప్ర‌భాస్..!

కేజీఎఫ్-2 ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా ప్ర‌భాస్..!

by AJAY
Ad

య‌శ్ హీరోగా న‌టించిన కేజీఎష్ సినిమా ఎలాంటి విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుద‌లైన ఈ చిత్రం కాసుల వ‌ర్షం కురిపించింది. భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను అబ్బుర‌ప‌రిచాయి. ఈ సినిమాతో ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ పేరు మార్మోగిపోయింది. ఇక ఈ సినిమాకు వ‌చ్చిన క్రేజ్ తో సీక్వెల్ కేజీఎఫ్ 2 పై భారీ అంచ‌నాలు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కేజీఎఫ్ 2ను ఎప్రిల్ 14న విడుద‌ల చేస్తున్న‌ట్టు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

Advertisement

prabhas

prabhas

దాంతో అభిమానులు ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా అరేంజ్ చేస్తార‌ని అనుకుంటున్నారు. అయితే అయితే ఇప్పుడు కేజీఎఫ్ 2 ప్రీరిలీజ్ ఈవెంట్ పై మ‌రో ఆస‌క్తిక‌ర వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా ప్ర‌భాస్ రాబోతున్నార‌ని ఫిల్మీ దునియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్ అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఈనేప‌థ్యంలో ప్ర‌భాస్ అతిధిగా వ‌స్తార‌న్న వార్త‌ల‌కు మ‌రిత బలం చేకూరింది. అయితే ఆ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కూ నిజం ఉందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Visitors Are Also Reading