Home » ప్రభాస్-బోయపాటి కాంబినేషన్ లో మూవీ ?

ప్రభాస్-బోయపాటి కాంబినేషన్ లో మూవీ ?

by Anji
Ad

పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. గత ఏడాది సలార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఇప్పుడు మరో మూడు ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. వీటిలో కల్కి, రాజాసాబ్ చిత్రాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. ఈ సినిమాలు పూర్తయిన తరువాత సలార్ 2, స్పిరిట్ సినిమాలు ప్రారంభం కానున్నాయి.

Advertisement

ఆ సినిమాలు ఇంకా మొదలు కాలేదు కానీ ఇప్పుడు మరో సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శీను దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్-బోయపాటి మధ్య సినిమా చర్చలు జరుగుతున్నాయని.. అవి సఫలం అయితే ఇద్దరి కాంబోలో అదిరిపోయే మాస్ సినిమా ఆడియన్స్ ముందుకు రానుందని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ పై ప్రభాస్ అభిమానులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. మాస్ మసాలా వస్తుందని ఆశపడుతున్నారు.

Advertisement

బోయపాటి ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ లో హీరో అల్లు అర్జున్, సూర్య, విజయ్ దేవరకొండ అంటూ పలు పేర్లు వినిపిస్తున్నాయి. ఏ హీరోతో సినిమా ఫైనల్ చేస్తారో చూడాలి. ప్రభాస్ నటించే కల్కి మే 09న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అన్ని కుదిరితే వీరిద్దరి మధ్య మూవీ వస్తే.. మాత్రం అభిమానులకు పండుగ అనే చెప్పాలి.

Also Read :  చిరంజీవి-సురేఖకు మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా ?

Visitors Are Also Reading