Home » చిరంజీవి-సురేఖకు మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా ?

చిరంజీవి-సురేఖకు మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టాలీవుడ్ లో అంచెలంచెలుగా ఎదిగి అగ్ర హీరోగా రాణిస్తున్నారు. అద్భుతమైన నటన, డ్యాన్స్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇటీవలే ఉత్తమ నటుడిగా పద్మవిభూషణ్ అవార్డును దక్కించుకున్నాడు. ముఖ్యమంత్రి, గవర్నర్ తో కూడా ప్రశంసలు అందుకున్నారు. తాజాగా చిరంజీవి గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.

Advertisement

Advertisement

 

మెగాస్టార్ చిరంజీవి అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ముగ్గురు సంతానం. సినిమా ఇండస్ట్రీతో సురేఖకు ఎలాంటి సంబంధం లేకున్నా.. ఫ్యాన్స్ మెగాస్టార్ కి ఎంత అభిమానం చూపిస్తారో ఈమెను కూడా అంతే గౌరవిస్తారు. బయట ఎక్కువగా కనిపించకున్నా సురేఖ పలు కార్యక్రమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి-సురేఖ మధ్య ఏజ్ గ్యాప్ ఎంత అంటూ నెట్టింట మెగా ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేశారట. వీరిద్దరికీ 1980లో పెళ్లి జరిగింది. అప్పటికీ చిరు సతీమణి సురేఖ వయస్సు 22 ఏళ్లు. చిరంజీవికి 25 సంవత్సరాలున్నాయి. అంటే వీరిద్దరికీ వయస్సు మూడు సంవత్సరాలు తేడా. సురేఖ ఫిబ్రవరి 18న 1958 జన్మించగా.. మెగాస్టార్ చిరంజీవి 1955 ఆగస్టు 22న జన్మించారు. ప్రస్తుతం వీరి ఏజ్ గ్యాప్ గురించి సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.

Also Read : తండ్రి అయిన యంగ్ హీరో నిఖిల్.. ఫొటో వైరల్..!

Visitors Are Also Reading