Home » పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఖాతాలో మ‌రో రికార్డు..ఇండియాలో ఫ‌స్ట్ హీరో..!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఖాతాలో మ‌రో రికార్డు..ఇండియాలో ఫ‌స్ట్ హీరో..!

by AJAY
Ad

రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరల్డ్ స్టార్ గా ఎదిగిపోయాడు. అయితే తాజాగా ప్రభాస్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 2021 సంవత్సరానికి సంబంధించి నంబర్ వన్ సౌత్ ఏషియన్ సెలబ్రిటీగా ప్రభాస్ నిలిచారు. యునైటెడ్ కింగ్ డ‌మ్ ఈస్టర్న్ వీక్లీ అనే ప్రముఖ వెబ్ సైట్ నిర్వహించిన ఓ సర్వేలో మొదటి స్థానంలో నిలిచిన ప్రభాస్ ఈ ఆరుదైన గౌర‌వాన్ని దక్కించుకున్నారు. ఈ విషయాన్ని వెబ్సైట్ ఒక కథనం రాసి ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 50 మంది సెలబ్రిటీలకు స్థానం ద‌క్క‌గా వారిలో ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచారని వెబ్ సైట్ పేర్కొంది.

prabhas

prabhas

అంతేకాకుండా ఇండియన్ హీరోలలో మరి ఏ హీరో కూడా ఇంతటి రికార్డును సాధించలేదు. ఇదిలా ఉండగా ప్రభాస్ బాహుబలి లాంటి సంచలన విజయం తర్వాత వ‌రుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అదేవిధంగా ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ ఈ సినిమాలో రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. మరో పాన్ ఇండియా స‌లార్ లోనూ ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు.

Advertisement

Advertisement

also read :అమితాబ్ ఇంట్లో పాలు పొంగించిన హీరోయిన్..అద్దె తెలిస్తే కంగుతినాల్సిందే..!

ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఇది ఇలా ఉండగానే ప్రభాస్ నాగ్ అశ్విన్ తో పాన్ వరల్డ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈచిత్రంలో ప్ర‌భాస్ కు జోడీగా దీపికా ప‌దుకునే హీరోయిన్ గా నటిస్తుండగా బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ తన 25వ చిత్రాన్ని అర్జున్ రెడ్డి లాంటి ఇండస్ట్రీని షేక్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమా కూడా పాన్ వరల్డ్ రేంజ్ లో తెర‌కెక్కిస్తున్నాడు.

Visitors Are Also Reading