Home » అమితాబ్ ఇంట్లో పాలు పొంగించిన హీరోయిన్..అద్దె తెలిస్తే కంగుతినాల్సిందే..!

అమితాబ్ ఇంట్లో పాలు పొంగించిన హీరోయిన్..అద్దె తెలిస్తే కంగుతినాల్సిందే..!

by AJAY
Ad

హైద‌రాబాద్ లో అద్దెలు వింటేనే అవాక్క‌యితే ముంబైలో ఉండే అద్దెలు వింటే షాక్ అవ్వాల్సిందే. అక్క‌డ ఒక్క సొంత ఇల్లు ఉంటే కాలు మీద కాలు వేసుకుని బ‌తికేయొచ్చు. అయితే అమితా భ‌చ్చ‌న్ కూడా త‌న‌కు ముంబైలో ఉన్న ఓ ఫ్లాట్ ను అద్దెకు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకోగా భారీ డిమాండ్ వ‌చ్చింది. ప‌లువురు బాలీవుడ్ తార‌లే ఆ ఇంటిని అద్దెకు తీసుకునేందుకు పోటీ ప‌డ్డారు. కానీ చిర‌గా ఆదిపురుష్ భామ కృతి స‌న‌న్ ఆ ఇంటిని ద‌క్కించుకుంది. ముంబై అంధేరీలోకండ్ వాలా రోడ్డులో అమితాభ్ కు ఈ ఫ్లాట్ ఉంది. అట్లాంటిస్ బిల్డింగ్ లో 27,28 అంత‌స్థుల్లో ఉన్న ఆ ఇంటిని అమితాబ‌చ్చ‌న్ అద్దెకు ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

Advertisement

amitab bachahan kruthi sanan

amitab bachahan kruthi sanan

ఇక ఈ ఇంటిని ఆయ‌న డిసెంబ‌ర్ 2020లో రూ.31 కోట్లు పెట్టి కొన్నార‌ట‌. అయితే ఇలాంటి ఇల్లులు ముంబైలో అమితాభ్ కు ఎక్కువ‌గానే ఉండగా వాటిని కూడా అద్దెకు ఇచ్చారు. ఇక ఈ ఇంటిని కూడా తాను అద్దెకు ఇస్తున్న‌ట్టు చెప్ప‌డంతో ప‌లువురు బాలీవుడ్ తార‌లే పోటిప‌డ్డారు. అందులో ఆదిపురుష్ హీరోయిన్ కృతి స‌న‌న్ ఏకంగా నెల‌కు రూ,10ల‌క్ష‌లు అద్దె చెల్లించేందుకు ఒప్పందం చేసుకుని మ‌రీ ఇంటిని సొంతం చేసుకుంది. అంతే కాకుండా రూ.60 ల‌క్ష‌లు ముందుగానే అడ్డాన్స్ కూడా ఇచ్చింది.

Advertisement

ఇక అమితాబ్ ఇంట్లో పాలు పొంగించిన ఆదిపురుష్ హీరోయిన్ 2023 వ‌ర‌కు ఇంట్లో ఉండేదుకు అగ్రిమెంట్ చేసుకుంది. ఇదిలా ఉండ‌గా కృతి స‌న‌న్ నంబ‌ర్ వ‌న్ సినిమాతో తెలుగు వారికి ప‌రిచ‌యం అయ్యింది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ‌టంతో అనుకున్న రేంజ్ లో ఆఫర్లు ద‌క్కించుకోలేక‌పోయింది. దాంతో మ‌ళ్లీ బాలీవుడ్ బాట ప‌ట్టింది. అక్క‌డ వ‌రుస ఆఫ‌ర్లు రావ‌డంతో అక్క‌డే సెటిల్ అయ్యింది. అంతే కాకుండా ప్ర‌స్తుతం ఏకంగా ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్ లో హీరోయిన్ గా సీత పాత్ర‌లో న‌టిస్తుంది.

Visitors Are Also Reading