Home » దారుణం:ప్రభాస్,అల్లు అర్జున్,  మహేష్ బాబు మరీ ఇలా మారారేంటి.. ఫోటోలు వైరల్..!

దారుణం:ప్రభాస్,అల్లు అర్జున్,  మహేష్ బాబు మరీ ఇలా మారారేంటి.. ఫోటోలు వైరల్..!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ మధ్యకాలంలో చాలామంది  వివిధ టెక్నాలజీలు వాడుకొని  ఫ్యూచర్లో వారు ఏ విధంగా  మారబోతున్నారు అనే ఫోటోలను ముందుగానే చూసుకుంటున్నారు. ఈ ఫోటోలు కామన్ వ్యక్తులు అయితే  ఏమి కాదు కానీ  స్టార్ హీరోలవి  కూడా ఈ విధంగా  చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్,  అల్లు అర్జున్ ఏఐ ఫొటోస్  చూస్తే వీరంతా వృద్దులుగా మారిపోయి కనిపిస్తున్నారు.ముడతలు పడిన స్టార్స్ లుక్స్  నెట్టింట వైరల్ గా మారాయి.

also read:పూరిని వీడని “లైగర్” చిక్కులు.. ఫిల్మ్‌చాంబర్‌ ఎదుట ఎగ్జిబిటర్ల ఆందోళన

Advertisement

వీటిని చూసిన వారి అభిమానులు కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే ,  మరి కొంతమంది మా అభిమాన హీరో వయసు మీద పడ్డాక ఈ విధంగా అవుతారా అని  అనుకుంటున్నారు. అయితే గత కొంతకాలంగా  ఆర్టిఫిషియల్ ఏఐ ఇంటిలిజెన్స్ ఆర్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న విషయం అందరికీ తెలుసు. గతంలో రాముడు సీత ఇలా ఉండేవారా అంటూ కొన్ని ఫొటోస్ హల్చల్ చేశాయి. తాజాగా ఇండియన్ ఫిల్మ్ సెలబ్రిటీస్ ఫొటోస్  చెక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ టాలీవుడ్ ఫేమస్ నటుల  ఏఐ ఫోటోలు  చూసి కొంతమంది అభిమానులు షాక్ అవుతున్నారు.

also read:తమన్నాతో డేటింగ్ పై విజయ్ వర్మ ఏమన్నారో తెలుసా ?

తమ అభిమాన హీరో లుక్స్ ఈ విధంగా మారిపోయాయి ఏంటి  అంటూ కామెంట్లు పెడుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లు అర్జున్,  ప్రభాస్ బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్  ఫోటోలు పూర్తిగా వృద్ధులుగా మారిపోయి కనిపించాయి. ముఖంపై ముడతలు పడిన వీరి లుక్స్  నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన వారి అభిమానులు కాస్త ఆగ్రహానికి గురవుతున్నారు. ఏఐ ఆర్టిస్టు ఎస్ కే యండి  అబుషాహిత్  స్టార్ హీరోలను వృద్ధులుగా మార్చడానికి మిడ్ జర్నీ ఉపయోగించారట.  మీ హీరోలను ఏఐ ముసలి వాళ్లుగా ఊహించుకోండి అంటూ కాప్షన్ ఇచ్చి  ఫోటోలు షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

also read:బియ్యం పురుగులు పడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే.. బెస్ట్ ఇంటి చిట్కాలు..!!

Visitors Are Also Reading