Home » “ఆదిపురుష్” సినిమా ఫస్ట్ రివ్యూ…ఎలా ఉందంటే…?

“ఆదిపురుష్” సినిమా ఫస్ట్ రివ్యూ…ఎలా ఉందంటే…?

by AJAY
Ad

Adipurush First Review: ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ఆది పురుష్. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కింది. బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. రామాయణం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే సినిమా ట్రైలర్ విడుదల కాగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. జూన్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Adipurush First Review

Adipurush First Review

దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు సినిమా క్రిటిక్ ఉమర్ సందు ఆదిపురుష్ సినిమా రివ్యూ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఉమర్ సందు చెప్పిన రివ్యూ ప్రకారం…. ఆది పురుష్ మూవీ నిరాశపరిచింది. ఈ సినిమాకు ఉమర్ సందు దారుణమైన రేటింగ్ ఇచ్చాడు.

Advertisement

Advertisement

ఉమర్ తన రివ్యూ లో…. ఆది పురుష్ భారీ బడ్జెట్ తో… క్యాస్ట్, విఎఫ్ఎక్స్ తో భారీ అంచనాల మధ్య విడుదల అయింది. కానీ దురదృష్టవశాత్తు భారీ డిజాస్టర్ గా కూడా ఈ సినిమానే నిలిచింది. ఈ సినిమాలో సోల్ లోపించింది. నటీనటుల పర్ఫామెన్స్ దారుణంగా ఉంది. ప్రభాస్ అయితే నటనలో శిక్షణ తీసుకుంటే బెటర్. ఆదిపురుష్ సినిమా ఒక టార్చర్. ప్రభాస్ క్రుతి సనన్ లకు ఆది పురుష్ తో మరో ఫ్లాప్ పడింది. అంటూ ఉమర్ రివ్యూ లో పేర్కొన్నాడు. అంతేకాకుండా ఆదిపురుష్ సినిమాకు కేవలం 2 రేటింగ్ మాత్రమే ఇచ్చాడు.

అయితే గతంలో కూడా ఉమర్ చాలా సినిమాలకు నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. ఉమర్ సందు ఫ్లాప్ సినిమాలు అంటూ రివ్యూ ఇచ్చిన సినిమాలు హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అంతే కాకుండా ఉమర్ సందు బ్లాక్ బస్టర్ అని చెప్పిన సినిమాలు డిజాస్టర్ గా నిలిచిన సినిమాలు కూడా ఉన్నాయి. దాంతో ఉమర్ రివ్యూలను జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక తాజాగా ఆది పురుష్ సినిమాపై ఉమర్ సందు నెగిటివ్ రివ్యూ ఇవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ఉమర్ సందు ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

Visitors Are Also Reading