Home » ఐపీఎల్ 2022 లో వింత సమస్య… కరెంట్ లేక చెన్నైకి నష్టం..!

ఐపీఎల్ 2022 లో వింత సమస్య… కరెంట్ లేక చెన్నైకి నష్టం..!

by Azhar
Ad

ఐపీఎల్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉంది అనేది అందరికి తెలిసిందే. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్ – ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఐపీఎల్ లో ఎంతో విజయవంతమైన జట్లుగా పేరు పొందిన ఈ రెండు జట్లు ఈ ఏడాది దారుణంగా విఫలమవుతున్నాయి. ఒక్కో విజయం కోసం నానా కష్టాలు పడుతున్నాయి. అటువంటు జట్ల మధ్య నేడు మ్యాచ్ జరుగుతుండగా.. ఇంకో వింత కష్టం ఆ మ్యాచ్ కు వచ్చింది.

Advertisement

అయితే ఈ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. కానీ ఈ మ్యాచ్ ప్రారంభమైన తర్వాత అక్కడ కరెంట్ కష్టం వచ్చింది. చెన్నై బ్యాటింగ్ చేస్తున్న రెండు ఓవర్లు కరెంట్ లేకపోవడంతో ఆ జట్టుకు డీఆర్‌ఎస్ తీసుకునే అవకాశం లేకుండా పోయింది. దానంతో ఆ జట్టుకు భారీ నష్టం జరిగింది. ఎలా అంటే.. కరెంట్ లేని ఆ రెండు ఓవర్లలోనే చెన్నై జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. అయితే అందులో రెండు వికెట్లు ఎల్బిడబ్ల్యు రూపంలోనే పడ్డాయి. దాంతో అక్కడ చెన్నై బ్యాటర్లు రివ్యూ తినుకోవాలి అనుకున్న కరెంట్ లేకపోవడంతో ఆది సాధ్యం కాలేదు.

Advertisement

ముమాబీ బౌలర్ డానియల్ సామ్స్ వేసిన ఫస్ట్ ఓవర్ రెండో బంతికే ఓపెనర్ డేవాన్ కాన్వే ఎల్బిడబ్ల్యు అయ్యాడు. దానికి అంపైర్ ఔట్ ఇచ్చాడు. కానీ బంతి లెగ్ సెడ్ వెళ్లినట్లు కనిపించడంతో ఆశ్చర్యం వ్యక్తం చేసిన కాన్వే రివ్యూ తీసుకోవాలి అనుకున్నాడు. అలాగే రెండో ఓవర్ నాలుగో బంతికి రాబిన్ ఊతప్ప విషయంలో కూడా సరిగ్గా ఇలాగె జరిగింది. అప్పుడు ఊతప్ప కూడా రివ్యూకు వెళ్ళాలి అని భావించాడు. కానీ కాంరేట్ లేక అది సాధ్య పడలేదు. దాంతో ఐపీఎల్ వంటి రిచ్ లీగ్ లో కరెంట్ సమస్య రావడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ 2022కు జడేజా గుడ్ బై…?

నయన్ తో సినిమాల్లోకి ధోని ఎంట్రీ…?

Visitors Are Also Reading