Home » ‘RRR’ మూవీ పై తగ్గని గ్లోబల్ క్రేజ్.. పాపులర్ సింగర్ కామెంట్స్ వైరల్..!

‘RRR’ మూవీ పై తగ్గని గ్లోబల్ క్రేజ్.. పాపులర్ సింగర్ కామెంట్స్ వైరల్..!

by Anji
Ad

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన తెరకెక్కించిన బాహుబలి సిరీస్, RRR వంటి సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా  దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి గ్లోబల్ హీరోస్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలు గా చేసిన ఈ చిత్రం గ్లోబల్ సెన్సేషనల్ గా మారింది. అయితే ఈ చిత్రం రీసెంట్ గా మరోసారి ఆస్కార్ స్టేజ్ పై మెరిసి ఇండియన్ సినిమా పేరు మారు మోగించగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

Advertisement

Advertisement

అయితే ఇంగ్లీష్ లో పాపులర్ సింగర్ అయినటువంటి ఈడ్ షీరన్  RRR సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఈ చిత్రంలో నాటు నాటు సాంగ్ అద్భుతం అని అందులో డాన్స్ కానీ టోటల్ సినిమా కూడా చాలా నచ్చింది అని 3 గంటలు సినిమా అయినప్పటికీ తనని ఎంతో అలరించింది అని కొనియడాడు. దీనితో చిత్ర యూనిట్ ఈ కామెంట్స్ తో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే RRR గ్లోబల్ హవా మాత్రం ఇప్పటికీ ఓ రేంజ్ లో కొనసాగుతుంది అని చెప్పి తీరాలి. అయితే రీసెంట్ గానే ఈడ్ షీరన్ బుట్టబొమ్మ సాంగ్ కి స్టెప్పులు వేయడం కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Also Read :  నిశ్చితార్థం చేసుకోబోతున్న రెజీనా.. లేటెస్ట్ పోస్ట్ వైరల్..!

Visitors Are Also Reading