Home » నిశ్చితార్థం చేసుకోబోతున్న రెజీనా.. లేటెస్ట్ పోస్ట్ వైరల్..!

నిశ్చితార్థం చేసుకోబోతున్న రెజీనా.. లేటెస్ట్ పోస్ట్ వైరల్..!

by Sravya
Ad

నటి రెజీనా టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోయిన్ గా కొనసాగుతూ మంచిగా గుర్తింపుని తెచ్చుకుంది. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్లలో ఒకరు. తన కెరియర్లో చాలా హిట్లు పడ్డాయి. తమిళ తెలుగు భాష సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ మంచిగా సక్సెస్ ని అందుకుంది. నటిగా ఇండస్ట్రీ లో ఎంతో బిజీగా ఉంటూ మరో పక్క వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ సందడి చేస్తోంది. ఇటీవల కాలం లో ఈమె కి సినిమా అవకాశాలు లేవని చెప్పొచ్చు. ఇండస్ట్రీ కి దూరంగా ఉన్నటు వంటి ఈమె సోషల్ మీడియా లో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటోంది.

Advertisement

రెజీనా పెళ్లి గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం ఈమె పై ఓ వార్త వైరల్ అవుతోంది. ప్రముఖ బిజినెస్ మాన్ తో ఏడడుగులు వేయబోతున్నట్లు త్వరలోనే ఈమె పెళ్లి చేసుకోబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వార్తలు వచ్చిన అనంతరం ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో భాగంగా రెజీనా అతనికి సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్ చేయడమే కాకుండా పోలింగ్ ఫర్ ఎంగేజ్మెంట్ అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్, ఆడియన్స్ ని ఉద్దేశిస్తూ పోస్ట్ చేస్తుంది.

Advertisement

ఈమె పోస్ట్ చేయడంతో బహుశా ఈమె నిశ్చితార్థం చేసుకోబోతుంది అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై నెటిజెన్స్ స్పందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి కొంతమంది పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు. పెళ్లి చేసుకోబోతున్నారా అందుకే ఇటువంటి పోస్ట్ చేశారా లేదంటే మరి ఏమైనా కారణం ఉందా అనేది తెలియదు. దీని మీద రెజీనా స్పందించాల్సి ఉంది. సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు బాగా బిజీ గా ఉండే రెజీనా కి ఈ మధ్యకాలంలో అవకాశాలు బాగా తగ్గుతూ వచ్చాయి సినిమా ఇండస్ట్రీకి కాస్త దూరంగానే ఉంటోంది. బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకి బ్రేక్ ఇవ్వబోతుందా లేదంటే మళ్లీ సినిమాల్లో కొనసాగించాలనుకుంటున్నా అనేది కూడా తెలియాల్సి ఉంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading