Home » పడిపోయిన కోహ్లీ వాల్యూ…టాప్ ప్లేస్ లో చరణ్!

పడిపోయిన కోహ్లీ వాల్యూ…టాప్ ప్లేస్ లో చరణ్!

by Bunty
Ad

విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టీమిండియా జట్టులో ఓ స్టార్‌ ప్లేయర్‌ గా కొనసాగుతున్నాడు విరాట్‌ కోహ్లీ.  ఇక ఈ మధ్యకాలంలో అనుకున్నంతగా ఆడలేకపోతున్న కోహ్లీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తగ్గదు కూడా. ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ లో నంబర్ వన్ గానే ఉన్నాడు. భారత క్రికెటర్ల సంపాదనలోనూ ఇప్పటికీ కోహ్లీనే కింగ్. అలాగే… కోహ్లీ ఫిట్నెస్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. కాగా, విరాట్ సైతం తన ఫిట్నెస్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. భారత సెలబ్రిటీల జాబితాలో ముందు వరుసలో ఉండే పేరు విరాట్ కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్ లో 75 సెంచరీలు పూర్తి చేసుకున్న ఈ రన్ మెషిన్ పేరే ఓ బ్రాండ్ అనడంలో సందేహం లేదు.

READ ALSO : టీమిండియాలో నో ఛాన్స్​.. ఇక సీరియల్​లో నటిస్తున్న శిఖర్​ ధావన్​!

Advertisement

Advertisement

రికార్డుల రారాజు అయినా కింగ్ కోహ్లీ, బ్రాండ్ వాల్యూ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అయితే తాజా నివేదికల ప్రకారం, దేశంలోని మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీ ట్యాగ్ ను కోహ్లీ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ స్థానాన్ని బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ఆక్రమించినట్లు సమాచారం. కాగా, గత ఐదేళ్లుగా కోహ్లీ వరుసగా ఇండియా మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీగా కొనసాగుతున్నాడు. అయితే 2021 టీ20 ప్రపంచ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ వదిలేసిన కోహ్లీని, ఆ తర్వాత ఏడాదిలో వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పించారు. అనంతరం కోహ్లీ టెస్ట్ పగ్గాలు కూడా వదిలేశాడు. ఓవైపు కెప్టెన్సీ చేజారడం, అదే సమయంలో నిలకడలేమి ఫామ్ తో సతమతమైన కోహ్లీ ఖాతాలో వెయ్యి రోజులపాటు సెంచరీ అన్నదే లేకుండా పోయింది ఈ పరిణామాలు కోహ్లీ బ్రాండ్ వాల్యూపై ప్రభావం చూపాయి.

READ ALSO : విరాట్ కోహ్లీ బయోపిక్ లో రామ్ చరణ్!

I look similar also: Ram Charan on wanting to do Kohli's biopic

ఈ నేపథ్యంలో క్రోల్స్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్టు 2022లో ఈ మేరకు రన్ వీర్, కోహ్లీని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకు వచ్చినట్లు పేర్కొంది కోహ్లీ బ్రాండ్ వేల్యూ 185.7 మిలియన్ డాలర్ల నుంచి 176.9 మిలియన్ డాలర్లకు పడిపోయినట్లు వెల్లడించింది. అదే సమయంలో 2021లో 158.3 మిలియన్ డాలర్ల బ్రాండ్ వేల్యూ కలిగిన రన్ వీర్ సింగ్ 2022లో 181.7 మిలియన్ డాలర్లతో టాప్ లోకి దూసుకువచ్చినట్లు తెలిపింది.అటు రామ్ చరణ్ మరో ఘనత సాధించారు. ఐడిఎంబి విడుదల చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.

READ ALSO : అవకాశం కోసం పక్కలోకి రమ్మన్నారు – శ్రీముఖి

Visitors Are Also Reading