Home » సమంత మాదిరిగానే అరుదైన వ్యాధి తో బాధపడుతున్న పూనమ్ కౌర్….ఆ వ్యాధి లక్షణాలు ఇవేనట…!

సమంత మాదిరిగానే అరుదైన వ్యాధి తో బాధపడుతున్న పూనమ్ కౌర్….ఆ వ్యాధి లక్షణాలు ఇవేనట…!

by AJAY

పూనమ్ కౌర్ అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమాలు చేయకపోయినా తన అందం అభినయంతో పూనమ్ కౌర్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన పూనమ్ కౌర్ అనేక వివాదాలు సమస్యల వల్ల సినిమాల నుండి దూరమైంది. సినిమాల నుండి దూరమైనప్పటికీ పునమ్ సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

అంతేకాకుండా టాలీవుడ్ లో ఓ డైరెక్టర్ మరియు స్టార్ హీరో పై ఆరోపాలు చేసి వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే పూనమ్ కౌర్ కు సంబంధించి ప్రస్తుతం ఓ వార్త నెట్టింట చెక్కర్లు కొడుతోంది. రీసెంట్ గా సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా పూనమ్ కూడా అరుదైన వ్యాధితో బాధపడుతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

బ్రయోమాయాల్సియా అనే సమస్యతో పూనమ్ బాధపడుతున్నట్టు వార్తలు గుంపుమంటున్నాయి. దాంతో ప్రస్తుతం పూనమ్ కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ వ్యాధి కారణంగా అలసట, నిద్రలేని జ్ఞాపకశక్తి తగ్గిపోవడం.. మానసిక స్థితిలో సమస్యలు రావడం దాంతోపాటు కండరాల నొప్పి తో పాటు అనేక ఇబ్బందులు వస్తాయట.

అంతేకాకుండా పూనమ్ కౌర్ గత రెండేళ్ల నుండి ఈ వ్యాధితో బాధపడుతోంది అని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ వ్యాధి నుంచి బయటపడేందుకే ప్రస్తుతం కేరళలో చికిత్స తీసుకుంటుంది అంటూ టాక్ వినిపిస్తోంది. కేరళలో దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ పూనమ్ కు సంబంధించి ఈ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పూనమ్ కౌర్ ఎస్వీ. కృష్ణారెడ్డి దర్శకత్వంలో మాయాజాలం సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తర్వాత విచిత్రం, శ్రీనివాస కల్యాణం సినిమాలలో నటించి అభిమానులను సంపాదించుకుంది.

Visitors Are Also Reading