Telugu News » Blog » ర‌హ‌స్యంగా న‌టి పూజిత పొన్నాడ‌తో దేవిశ్రీ ప్ర‌సాద్ పెళ్లి…? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్….!

ర‌హ‌స్యంగా న‌టి పూజిత పొన్నాడ‌తో దేవిశ్రీ ప్ర‌సాద్ పెళ్లి…? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్….!

by AJAY
Ads

టాలీవుడ్ లో ఏజ్ బార్ అవ‌తున్నా ఇంకా పెళ్లి చేసుకోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ల లిస్ట్ లో దేవి శ్రీ ప్రాస‌ద్ కూడా ఉన్నాడు. టాలీవుడ్ గ‌త కొద్దిరోజులుగా త‌మ‌న్ హ‌వా కనిపిస్తుంది కానీ ఇది వ‌ర‌కు మొత్తం దేవిశ్రీ హ‌వానే క‌నిపించేది. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు దేవిశ్రీ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. ఏం జ‌రిగిందో కానీ ఇటీవ‌ల కాలంలో మాత్రం దేవి శ్రీని ద‌ర్శ‌కులు ప‌క్క‌న పెడుతున్నారు.

Ads

కానీ పుష్ఫ సినిమాతో దేవి శ్రీ త‌నేంటో మ‌ళ్లీ ప్రూవ్ చేసుకున్నాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన సినిమాల‌న్నింటికి దేవిశ్రీ స్వ‌రాలు స‌మకూర్చారు. ఇక పుష్ఫ సినిమాతో దేవి శ్రీకి పాన్ ఇండియా లెవ‌ల్ లో గుర్తింపు వ‌చ్చింది. అయితే అప్ప‌ట్లో దేవి శ్రీ ప్ర‌సాద్ హీరోయిన్ చార్మితో ప్రేమాయ‌ణం నడిపిస్తున్నాడంటూ వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే.

Ads
devisriprasad

devisriprasad

అయితే వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని త‌ర‌వాత కాలంలో తెలిసింది. ఇదిలా ఉండ‌గా దేవి శ్రీ ప్ర‌సాద్ టాలీవుడ్ కు చెందిన న‌టిని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారంటూ కూడా ఇటీవ‌ల మీడియాలో వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. ఆ న‌టి మ‌రెవ‌రో కాదు పూజిత పొన్నాడ. ఈ వార్త‌లు నెట్టింట చెక్క‌ర్లు కొట్ట‌డంతో తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.

Ad

devisriprasad

దేవి శ్రీ ప్ర‌సాద్ తో రిలేష‌న్ షిప్ లో ఉన్న‌ట్టు వస్తున్న వార్త‌లు అవాస్తవం అని చెప్పింది. మేం ఇద్ద‌రం పెళ్లి చేసుకున్నామంటూ కూడా వార్త‌లు వ‌చ్చాయ‌ని….కానీ ఆ వార్త‌లు ఎలా పుట్టుకువ‌చ్చాయో త‌మ‌కు తెలియ‌ద‌ని చెప్పింది. తాను ఎవ‌రితోనూ రిలేష‌న్ షిప్ లో లేన‌ని ప్ర‌స్తుతం తాను సింగిల్ గానే ఉన్నాన‌ని క్లారిటీ ఇచ్చింది.