Home » Pooja Hegde : స్టార్ హీరో కొడుకుతో పూజా హెగ్డే పెళ్లి…ఏప్రిల్‌ లో ముహుర్తం !

Pooja Hegde : స్టార్ హీరో కొడుకుతో పూజా హెగ్డే పెళ్లి…ఏప్రిల్‌ లో ముహుర్తం !

by Bunty
Ad

పూజ హెగ్డే ఈ పేరుకు స్పెషల్గా పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన నటన, అందంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ అమ్మడు. ఎన్నో సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. వరుస సినిమాలతో ఎప్పుడు ఫుల్ బిజీగా ఉండే పూజ ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉంటుంది. ఒకటి, రెండు సినిమాలు తప్ప తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఇక ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటిస్తోంది. పూజ హెగ్డే సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటుంది.

Pooja Hegde wedding with star hero son

ఇది ఇలా ఉండగా…. హిందీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరో కొడుకును పూజ పెల్లాడబోతున్నట్లు తెలుస్తోంది. వీరి వివాహానికి ఇరువైపులా కుటుంబాలు ఒప్పుకున్నట్లు సమాచారం. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ రావడంతో రేపో, ఎల్లుండో పూజ దీన్ని అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి చివరలో వివాహం జరిగే అవకాశం ఉంది. ఇదంతా పక్కకు పెడితే… ఈ క్రమంలోనే పూజా హెగ్డే సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు పూజపై తెగ ఫైర్ అవుతున్నారు. వివరాల్లోకి వెళితే….. దీపావళి పండుగను ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే వారు చాలా గ్రాండ్ గా దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు.

Advertisement

Advertisement

వారి అభిమానులకు విషెస్ తెలుపుతూ ఉంటారు. అలానే పూజ హెగ్డే కూడా తన అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ఓ ఫోటోను ట్విట్టర్ ఎక్స్ వేదికగా పంచుకుంది. అంతే ఇక పూజను ట్రోలర్స్ తెగ ఆటాడేసుకుంటున్నారు. ‘రెడీ ఫర్ నైట్ అనేదర్ దివాళి మ్యాజిక్’ అని ట్విట్టర్ లో రాసకొచ్చారు? తాను పోస్ట్ చేసిన ఫోటోలో పూజ వాష్ రూమ్ లో ఉన్నట్టుగా కనిపించింది. అంతేకాకుండా వాష్ బేసిన్ ముందు నిల్చోని కాస్త హాట్ లుక్స్ ఇచ్చింది. దీంతో ఈ ఫోటో చూసిన చాలామంది షాక్ అవుతున్నారు. పండుగ రోజున బాత్రూంలో దిగిన ఫోటోలు షేర్ చేయడానికి సిగ్గుండాలి అంటూ తన ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వస్తున్నాయి. ఇక ఈ కామెంట్స్ పై పూజ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading