Home » పవన్ సినిమా నుండి పూజా ఎందుకు తప్పుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

పవన్ సినిమా నుండి పూజా ఎందుకు తప్పుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Azhar
Ad
టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటూ రాజకీయాలను.. ఇటు సినిమాలను ఒక్కేసారి నడిపిస్తున్నారు. పాలిటిక్స్ కారణంగా సినిమాలకు దూరమైన మళ్ళీ వకీల్ సాబ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పవన్.. ఆ తర్వాత వరుసబెట్టి సినిమాలను అనౌన్స్ చేసారు. అందులో ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్రిష్ డైరెక్షన్ చేస్తున్నారు.
ఈ సినిమా తర్వాత కూడా పవన్ కు వరుస సినిమాలు ఉన్నాయి. అందులో గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో కూడా ఓ సినిమా ఉంది. దీనికి భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు. అలాగే ఇందులో పవన్ సరసన స్టార్ హీరోయిన్ పూజ హేగ్దే నటిస్తుంది అని తెలిసింది. అయితే ఫస్ట్ లుక్ వచ్చిన ఈ సినిమా నుండి మాత్రం ఇంకా ఏ విధమైన అప్డేట్ రాలేదు. అలాగే సినిమా షూటింగ్ కూడా ఇంకా ఆరంభం కాలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ సినిమా పై పెద్దగా ఆసక్తిగా లేరు అని తెలుస్తుంది.
ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి హీరోయిన్ పూజ తప్పుకుంది అని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న పూజ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలియని సినిమా కోసం డేట్స్ ఖాళీగా ఉంచలేకపోతుంది అని తెలుస్తుంది. ఈ సినిమా వాళ్ళ వేరే సినిమాలు మిస్ అవుతున్నాయని.. పూజ ఈ ప్రాజెక్ట్ నుడి తప్పుకుంది అని సమాచారం. అయితే ఎన్నికల సమయం దగ్గరకు వస్తుండటంతోనే పవన్ రాజకీయాలపైన దృష్టి పెట్టి ఈ సినిమాను పెద్దగా పట్టించుకోవడం లేదు అని సమాచారం.

Advertisement

Visitors Are Also Reading