Home » తనను విమర్శించిన వారికి సమాధానం ఇచ్చిన సిరాజ్.. ఏమన్నాడంటే..?

తనను విమర్శించిన వారికి సమాధానం ఇచ్చిన సిరాజ్.. ఏమన్నాడంటే..?

by Azhar
Ad
ఐపీఎల్ 2020లో ఎవరు ఊహించని విధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బౌలర్ మొహ్మద్ సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. దాంతో అతడిని భారత టెస్ట్ జట్టుకు ఎంపిక చేసారు. అక్కడ కూడా సిరాజ్ తన స్థాయికి మించిన ప్రదర్శన ఇచ్చాడు. దాంతో టెస్ట్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసాడు. అలాగే ఐపీఎల్ 2021 లో కూడా సిరాజ్ బాగానే రాణించాడు. హర్షల్ పటేల్ కు తోడుగా నిలిచాడు. ఆ కారణంగానే ఈ ఐపీఎల్  2022 సీజన్ కోసం జరిగిన మెగా వేలానికి ముందు సిరాజ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 7 కోట్లకు రిటైన్ చేసుకుంది.
ఇక ఎన్నో అంచనాల మధ్య ఈ సీజన్ ప్రారంభించిన సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడు. మొత్తం 15 మ్యాచులు ఆడిన సిరాజ్ దాదాపు ప్రతి ఓవర్ లోను 10 కి పైగా పరుగులు ఇచ్చాడు. 10.07 ఎకానమీతో కేవలం 9 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. దాంతో అతని పై చాలా విమర్శలు వచ్చాయి. అయిన కూడా వచ్చే నెలలో ఇంగ్లాండ్ తో జరగనున్న 5వ టెస్ట్ మ్యాచ్ కోసం అతడిని ఎంపిక చేసారు బీసీసీఐ సెలక్టర్లు. ఇక ప్రస్తుతం దాని పైనే దృష్టి పెట్టిన సాయిరాజ్ తనను విమర్శించిన వారికి సమాధానం తాజాగా సమాధానం ఇచ్చాడు.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన సిరాజ్ మాట్లాడుతూ… ఈ ఐపీఎల్ లో నేను అనుకున్నా విధంగా రాణించలేదు. గత రెండు సీజన్ లలో మంచి ప్రదర్శనే చేశాను. ఇప్పుడు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం సిద్ధమవుతున్న. నా శక్తి మేర కష్టపడి నా సామర్ధ్యం నేను పెంచుకుంటాను. నా మీద నాకు నమ్మకం ఉంది. ఇంగ్లాండ్ పిచ్ లకు తగ్గట్లుగా నేను సిద్ధమవుతున్నాను. అయితే ఈ సిరీస్ లో మేము ఇప్పటికే 2-1 తో ఆధిక్యంలో ఉన్నం. అందువల్ల మాకు ఆత్మవిశ్వసం బ్లాంగే ఉంది. ఎలాగైనా అందులో గెలుస్తాం అనే నమ్మకం ఉంది.

Advertisement

Visitors Are Also Reading