పూజా హేగ్దే ఇప్పుడు సౌత్ తో పాటుగా బాలీవుడ్ లో కూడా మంచి డిమాండ్ లో ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు నటించిన సినిమాలు అన్ని ప్లాప్ అవుతున్నా కూడా పూజాకు అవకాశాలు అనేవి తగ్గడం లేదు. అయితే ఇలాంటి ప్లాప్ సినిమాల మధ్య పూజాకు ఓ సూపర్ హిట్ సినిమా అనేది మిస్ చేసింది కరోనా మహమ్మారి. సినిమా ఇండస్ట్రీకి ఇప్పటికే ఎంతో నష్టం చేసిన కరోనా పూజాకు ఇప్పుడు కొంచెం ఎక్కువ చేసింది.
Advertisement
అయితే కరోనా వల్ల పూజా మిస్ అయిన సినిమా ఏంటంటే సీతారామం. ఈ నెల 5న దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన ఈ సినిమా అనేది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇందులో మరో ప్రధాన పాత్రలో రష్మిక కూడా నటించింది. కానీ ఈ సినిమాలో హీరోయిన్ మృణాల్ ఠాగూర్ కనిపించిన పాత్ర ముందుగా పూజా దగ్గరకే వెళ్లినట్లు తెలుస్తుంది.
Advertisement
సినిమా కథ మొత్తం విన్న పూజా సినిమాకు ఓకే కూడా చెప్పింది. ఇక ఆ తర్వాత ఈ సినిమా నిర్మాత సంస్థ అయిన వైజయంతి మూవీస్ భారీ సెట్స్ తో మొత్తం రెడీ చేసింది. ఇక షూటింగ్ స్టార్ట్ అనుకున్న సమయంలోనే పూజాకు కరోనా సోకింది. అందువల్ల షోట్టింగ్ వాయిదా వేయాలి. కానీ అలా చేస్తే నిర్మాణ వ్యయం పెరుగుతుంది అని భావించి.. పూజా స్థానంలో మృణాల్ ఠాగూర్ ను పెట్టి సినిమా చేసారు.
ఇవి కూడా చదవండి :