Telugu News » ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. బన్నీ ఫ్యాన్స్‌కు గాయాలు

ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. బన్నీ ఫ్యాన్స్‌కు గాయాలు

by Bunty

హైద‌రాబాద్ లోని ఎన్ క‌న్వెన్ష‌న్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ ఫొటోలు దిగేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఎన్ క‌న్వెన్ష‌న్ కు చేరుకున్నారు. ఎంత సేప‌టికీ గేట్లు తెర‌వ‌క‌పోవ‌డంతో ఆగ్ర‌హించిన అభిమానులు గేట్లు విర‌గొట్టి లోప‌లికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు.

అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవ‌డ‌వ‌తో పోలీసులు కంట్రోల్ చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. పోలీసులకు, అభిమానుల‌కు మ‌ధ్య తోపులాట జ‌రిగింది. ఫ్యాన్స్ ను కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీల‌కు ప‌నిచెప్పి చెద‌ర‌గొట్టారు. అయితే ఈ తోపులాట‌లో ప‌లువురు అభిమానుల‌కు గాయాల‌య్యాయి.

అల్లు అర్జున్ తో ఫొటోలంటూ అభిమానుల‌కు మెసేజులు రావ‌డంతో తాము ఇక్క‌డికి వ‌చ్చామ‌ని అభిమానులు చెబుతున్నారు. తోపులాట కార‌ణంగా ప్రొగ్రామ్ ర‌ద్దయిన‌ట్లు నిర్వాహ‌కులు ప్ర‌క‌టించారు. ప్రొగ్రామ్ ర‌ద్దు కావ‌డంతో గంట‌ల త‌ర‌బ‌డి గేటు ద‌గ్గ‌ర ఎదురుచూస్తున్న అభిమానులు ఆగ్ర‌హంతో ఆందోళ‌న‌ల‌కు దిగారు.

Visitors Are Also Reading