Home » జీవిత రాజ‌శేఖ‌ర్ పెళ్లిలో అభిమానుల‌పై పోలీసుల లాఠీ చార్జ్‌.. ఇన్ని రోజుల త‌రువాత ఇప్పుడు ఎలా బ‌య‌ట‌ప‌డిందంటే..?

జీవిత రాజ‌శేఖ‌ర్ పెళ్లిలో అభిమానుల‌పై పోలీసుల లాఠీ చార్జ్‌.. ఇన్ని రోజుల త‌రువాత ఇప్పుడు ఎలా బ‌య‌ట‌ప‌డిందంటే..?

by Anji
Ad

హీరోయిన్ జీవిత‌, హీరో రాజ‌శేఖ‌ర్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే వీరు ప్రేమ పెళ్లి చేసుకున్నార‌ని చాలా మందికి తెలుసు. కానీ ఈ పెళ్లిలో తెలుసుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే..? జీవిత రాజ‌శేఖ‌ర్ పెళ్లిలో అభిమానుల‌పై పోలీసులు లాఠీ చార్జీ చేసిన విష‌యాన్ని చాలా త‌క్కువ మందికి తెలుసు. 1991వ సంవ‌త్స‌రంలో చైన్నైలో జీవిత‌, రాజ‌శేఖ‌ర్ వివాహం జ‌రిగింది. హీరో రాజ‌శేఖ‌ర్ తండ్రి చెన్నైలో పోలీస్ ఆఫీస‌ర్ గా విధులు నిర్వ‌హించే వాడు. ఎంతో వైభ‌వంగా చెన్నైలోనే అత్యంత ఘ‌నంగా వీరి పెళ్లి జ‌రిగింది. వీరి పెళ్లికి చాలా మంది అభిమానుల‌ని కూడా ఆహ్వానించారు.

Advertisement

రాజ‌శేఖ‌ర్ పెళ్లికి తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు చెన్నైకి త‌ర‌లివెళ్లారు. అక్క‌డికి చాలా మంది అభిమానులు రావ‌డంతో అక్క‌డ సెల‌బ్రిటీస్‌కి చాలా ఇబ్బంది ఏర్ప‌డింద‌ట‌. దీంతో అంత మంది సెల‌బ్రిటిస్ ని ఒక్క‌సారిగా చూసిన అభిమానులు ఎగ‌బ‌డే ప్ర‌య‌త్నం చేయ‌డంతో ఉన్న ఫ‌లంగా రాజ‌శేఖ‌ర్ తండ్రి లాఠీ చార్జ్ చేయించారు. ఈ విష‌యం ఇన్నాళ్ల త‌రువాత బ‌య‌టికి రావ‌డం ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారింది. ఈ విష‌యాన్ని బ‌య‌ట పెట్టింది మ‌రెవ్వ‌రో కాదు.. రాజ‌శేఖ‌ర్ వీరాభిమాని అయిన‌టువంటి జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడీయ‌న్ త‌డివేలు.

Advertisement

సీని ఇండ‌స్ట్రీలోకి రాక‌ముందు రాజ‌శేఖ‌ర్ వీరాభిమానిగా ఉన్నాడ‌ట త‌డివేలు. రాజ‌శేఖ‌ర్, జీవిత‌ల పెళ్లి చూడ‌డానికి త‌న భార్య తాళిని తాక‌ట్టు పెట్టి మ‌రీ రైలులో చెన్నై వెళ్లి పెళ్లి మండ‌పానికి చేరుకున్నాడ‌ట‌. పెళ్లి చూద్దామ‌ని ఎంతో ఆశ‌తో వెళ్లిన త‌డివేలుకి అక్క‌డ పోలీసుల‌తో లాఠీ దెబ్బలు తిన్నాడు. ఈ విష‌యం ఇటీవ‌ల ఒక ఇంట‌ర్వ్యూలో త‌డివేలు బ‌య‌ట పెట్ట‌డంతో అభిమానులంద‌రూ ఒక్క‌సారిగా షాక్ కి గుర‌య్యారు. కానీ అక్క‌డ ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ద‌డం కోసం లాఠి చార్జీ చేయించ‌డం కూడా ఒక ర‌కంగా మంచికే అని చెప్పాలి. ప్ర‌స్తుతం ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Also Read : 

ఆ ఒక్క కారణం తో బాహుబలిని మిస్ చేసుకున్న “సీతారామం” హీరోయిన్…! ఆ కారణం ఏంటి..?

మహానటి సావిత్రి చివరి కోరిక వెనుక ఇంత ట్విస్ట్ ఉందా..?

Visitors Are Also Reading