Home » పోకిరి సినిమా జ్యోతి మరీ ఇలా మారిపోయింది ఏంటి..?

పోకిరి సినిమా జ్యోతి మరీ ఇలా మారిపోయింది ఏంటి..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో ఒకరైన పూరి జగన్నాథ్ ఎప్పుడు కూడా కొత్త హీరోయిన్లను పరిచయం చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఆయన ఇండస్ట్రీకి 20 మందికి పైగా హీరోయిన్లను తెరంగెట్రం చేయించారు. అందులో పోకిరి సినిమా లేడీ విలన్ ప్రకాష్ రాజ్ గర్ల్ ఫ్రెండ్ మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆమె పేరే జ్యోతి రానా.. పోకిరి సినిమాలో లేడీ విలన్ పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో హాట్ హాట్ గా కనిపిస్తూ మహేష్ బాబు కు కూడా లైన్ వేస్తుంది.

Advertisement

దీంతో ఈ అమ్మడు చాలా పాపులర్ అయ్యింది. మాఫియా గ్యాంగ్ లీడ్ చేసే లేడి విలన్ గా నటిస్తూ, ఈ సినిమాలో గిల్లితే గిల్లించుకోవాలి అని ప్రకాష్ రాజ్ ఈ విలన్ ని ఉద్దేశించి చెప్పిన డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది. దీని తర్వాత దేవుడు చేసిన మనుషులు, హోమం లాంటి మూవీస్ లో నటించినప్పటికీ అవి ఫ్లాప్ అవడంతో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో సినిమా ఛాన్సులు తగ్గిపోయాయి. ఈ ఏడాది దగడ్ సాంబ సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Advertisement

 

ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో అవకాశాలు తక్కువై మోడలింగ్ చేస్తూ సెటిల్ అయింది.ఓ వైపు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో నెటిజన్లు ఈ లేడి విలన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని క్వాలిటీస్ అన్నీ ఉన్నా అవకాశాలు మాత్రం రాకపోవడం చాలా బాధాకరం అని, ఆమెకు మళ్లీ ఛాన్స్ ఇచ్చే దర్శకుడు పూరి జగన్నాధే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

also read:

Visitors Are Also Reading