Home » ఆర్బీఐ కొత్త స్కీంను ప్రారంభించ‌నున్న మోడీ

ఆర్బీఐ కొత్త స్కీంను ప్రారంభించ‌నున్న మోడీ

by Sravan Sunku
Published: Last Updated on
Ad

 

Advertisement

ప్రభుత్వ సెక్యూరిటీ లో రిటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆహ్వానిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొన్ని నెలల క్రితం ఆర్బీఐ రిటైల్‌ డైరెక్ట్‌’ స్కీం ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని ఉపయోగించి రిటైల్ పెట్టుబడిదారులు ఆర్‌బీఐ డైరెక్ట్ గిల్ట్‌ అకౌంట్ తెరచి నేరుగా ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్ ఈ సంవ‌త్స‌రం ఫిబ్రవరిలో ఈ స్కీంను న‌వంబ‌ర్ 12న ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధికారికంగా ప్రారంభించనున్నారు.

Advertisement

కరోనా కారణంగా కుదేలైపోయిన ఆర్థిక రంగాన్ని గట్టెక్కించడమే ప్రధాన లక్ష్యంగా గవర్నర్‌ శక్తికాంతా దాస్‌ ఈ స్కీంను ప్రవేశపెట్టారు. అమెరికా, బ్రెజిల్‌ లాంటి దేశాలు రిటైల్‌ పెట్టుబడులను పరోక్షంగా అనుమతిస్తున్నాయి. తాజా స్కీంతో భారత్‌ కూడా ఈ జాబితాలోకి చేరనుంది. తద్వారా ప్రభుత్వ సెక్యూరిటీల్లోకి రిటైల్‌ ఇన్వెస్ట్‌మెంట్లను అనుమతించిన తొలి ఆసియా దేశంగా గుర్తింపు పొందనున్న‌ది. ఆర్బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ స్కీం ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్లో

అతి పెద్ద నిర్మాణాత్మక సంస్కరణ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇందులో రిజిష్టర్‌ చేయాలనుకునే ఇన్వెస్టర్లకు దేశీయంగా ఏదైనా బ్యాంకులో ఎస్‌బీ ఖాతా ఉండాలి. పాన్‌కార్డు, ఈ- మెయిల్‌ ఐడీ, రిజిష్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ సహాయంతో కేవైసీ ప్రక్రియను పూర్తిచేయవచ్చు. కాగా ఈ పథకం కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ఆర్బీఐ ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి: కిషన్‌రెడ్డి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురావాలి : మంత్రి హరీష్‌రావు

 
Visitors Are Also Reading