ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు మరో రెండు రైల్వేలైన్లను ప్రారంభించనున్నారు. ఈ రైల్వేలైన్లు ఐదవ మరియు ఆరవది కాగా ఇవి థానే మరియు మహరాష్ట్రలోని దివాను కలుపుకుని నిర్మించారు. అయితే ఈ రైల్వే లైన్లను ప్రధాని ఈ రోజు సాయంత్రం విడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు.
Advertisement
అంతే కాకుండా ఈ కాన్ఫరెన్స్ ద్వారా ముంబై లోని సుబురున్ రైల్వే స్టేషన్ లో సుబురన్ రైలుకు కూడా పచ్చజెండా ఊపనున్నారు. థానే నుండి మహరాష్ట్రలోని దివా మధ్యన వేసిన రైల్వే లైనును దాదాపుగా 620 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్టుగా తెలుస్తోంది. ముంబై అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టు కింద ఈ రైల్వే లైనును కేంద్రం ప్రారంభించింది. అంతే కాకుండా ఈ రైల్వే లైనుకు 2008 లో శంకుస్థాపన చేశారు.
Advertisement
also read : బీజేపీది బూటకు జాతీయవాదం..మోడీపై మన్మోహన్ సింగ్ ఫైర్..!
ఇక ఈ రైల్వే లైనుకు మధ్యలో 1.4 కిలో మీటర్ల రైల్వే ఫ్లై ఓవర్ ను కూడా నిర్మించారు. దానితో పాటూ మూడు భారీ బ్రిడ్జిలను మరియు 21 మైనర్ బ్రిడ్జిలను నిర్మించారు. ఈ మైనర్ బ్రిడ్జి ల ద్వారా ముంబైలోని ట్రాఫిక్ కు కూడా అంతరాయం కలగకుండా నిర్మించినట్టు సమాచారం. ఈ రైల్వే లైన్ పై మరో 36 సుబురన్ రైల్లను భవిష్యత్ లో ప్రారంభించనున్నారు. అదే విధంగా మరో 100 వరకూ లోకల్ ట్రైన్ లను కూడా ఈ ఏడాదిలోపే ప్రారంభిచనున్నారు.