Home » మాజీ సీఎం కేసీఆర్‌కు షాక్.. హైకోర్టులో పిటిషన్..!

మాజీ సీఎం కేసీఆర్‌కు షాక్.. హైకోర్టులో పిటిషన్..!

by Anji
Ad

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు అయింది. కోకాపేటలో బీఆర్‌ఎస్‌కు భూమి కేటాయింపులో కేసీఆర్‌పై పిటిషన్‌ దాఖలు అయింది. ఎకరం రూ.100 కోట్లు విలువ చేసే 11 ఎకరాల భూమిని మొత్తం కేవలం రూ.37.43 కోట్లకు కేటాయించారని హైకోర్టులో పిటిషన్‌ వేశారు న్యాయవాది ఎ.వెంకట్రామిరెడ్డి. చట్టానికి విరుద్ధంగా భూకేటాయింపు జరిగిందని పిటిషన్ లో పేర్కొన్నారు. కేసీఆర్ పై వేసిన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. 

cm kcr

Advertisement

Advertisement

గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సెలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ సెంటర్ కోసం కోకాపేటలో (సర్వే నెం. 239, 240) 11 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. గతేడాది దీనికి సంబంధించి ఒక మెమో (నెం. 12425) లాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎకరం రూ.100 కోట్లు విలువ చేసే 11 ఎకరాల భూమిని ఆనాటి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని ఒక్కో ఎకరానికి రూ. 3.42 కోట్ల చొప్పున మార్కెట్ విలువ ప్రకారం మొత్తం 11 ఎకరాలకు రూ. 37.53 కోట్లకు కేటాయించారు. వాస్తవానికి ఆ భూమి ధర మొత్తం రూ. 1100 కోట్ల మేర ఉంటుందని, అతి తక్కువ ధరకు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టడాన్ని సవాలు చేస్తూ వెంకట్రామిరెడ్డి అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Visitors Are Also Reading