ఖర్బూజ పండులో అధిక పరిమాణంలో పోషకాలు లభిస్తాయి. వీటిని శీతాాకాలంలో తినడం వల్ల శరీరానికి పోషకాలు పుష్కలంగా లభించి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఖర్బూజలో కేలరీలు, కొవ్వు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లకు తక్కువ పరిమాణంలో లభిస్తాయి. అంతేకాదు.. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. సులభంగా శరీర బరువును నియంత్రిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ చర్మంపై ఆక్సీకరణ ఒత్తిడికి గురికాకుండా కాపాడుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఖర్బూజ పండును తీసుకోవాలి.
- ఖర్బూజ పండులో కరిగే ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి దీనిని ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
- పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు, ఆంథోసైనిన్లు ఖర్బూజ పండులో పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్ ని తగ్గించి సెల్స్ డ్యామేజ్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు.. యాంటి ఆక్సిడెంట్లను తగ్గించడానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.
Also Read : పచ్చి బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
- ఖర్బూజ పండులో అధికంగా పొటాషియం, విటమిన్ సి ఉంటాయి. వీటిని ప్రతిరోజు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు.. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే గుణాలు రక్తపోటుని తగ్గించి రక్తహీనత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
- ప్రధానంగా శీతాకాలంలో ఖర్బూజ పండును తినడం వల్ల విటమిన్ సి, రిబో ఫ్లేవిన్స్ లభిస్తాయి. అంతేకాదు.. ఫ్రీ రాడికల్స్ ని నియంత్రించి రోగ నిరోధక శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు.. శీతాకాలంలో అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు సహాయపడుతాయి.
Also Read : పాలిచ్చే తల్లులు ఈ ఫుడ్స్ తప్పనిసరిగా తీసుకోవాలి