Home » పాలిచ్చే తల్లులు ఈ ఫుడ్స్ తప్పనిసరిగా తీసుకోవాలి 

పాలిచ్చే తల్లులు ఈ ఫుడ్స్ తప్పనిసరిగా తీసుకోవాలి 

by Anji
Ad

పాలిచ్చే మహిళలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రసవం తరువాత.. శిశువును జాగ్రత్తగా చూసుకునే క్రమంలో చాలా మంది మహిళలు తమ సొంత ఆరోగ్యాన్ని విస్మరిస్తారు. అలా చేయడం వారి ఆరోగ్యంతో పాటు బిడ్డకి కూడా చాలా హానికరం. అలాంటి పరిస్థితిలో డెలివరీ తరువాత మహిళలు తమ సొంత ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మహిళలు పలు రకాల సూపర్ ఫుడ్స్ ని డైట్ లో చేర్చుకోవచ్చు. తల్లి పాలు ఇచ్చే స్త్రీల ఆహారంలో ఏయే ఆహారాలను చేర్చవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

ప్రధానంగా పండ్లు, పచ్చి కూరగాయలు తీసుకోవాలి. వీటిలో కాల్షియం, ఫైబర్, యాంటి ఆక్సిడెంట్ గుణాలు, విటమిన్లు ఏ, సి, ఇ, కే పుష్కలంగా ఉంటాయి. వీటిలో తక్కువ మొత్తంలో కేలరీలుంటాయి. బాలింతలు ఆకు కూరలను స్మూతీస్ రూపంలో తీసుకుంటే.. మేలు అంటున్నారు. ఆరోగ్య నిపుణులు సలహాలు, సూచనలు మేరకు పండ్లను కూడా తరుచూ తీసుకోవాలి. సలాడ్లు లేదా స్మూతీల రూపంలో తీసుకోవచ్చు. అదేవిధంగా నానబెట్టిన ఫ్రూట్స్ తీసుకోవాలి. ఆహారాల్లో ఐరన్, కాల్సియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు ఉంటాయి. ఈ డ్రై ప్రూట్స్ ని రాత్రి అంతా నానబెట్టి ఉంచుకోవచ్చు. బాలింతలు కచ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్స్ లో చియా విత్తనాలు ఒకటి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. నవజాత శిశువుల మెదడుని అభివృద్ధి చేస్తుంది. చియా విత్తనాలు సాధారణంగా సలాడ్లు, స్మూతీస్ తదితర రూపాలలో తీసుకుంటే లాభముంటుంది. 

బొప్పాయి :

Manam News

Advertisement

బొప్పాయిలో విటమిన్లుంటాయి. పాలు ఇచ్చే స్త్రీలు బొప్పాయిని సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది తల్లి పాల నాణ్యతను మెరుగు పరచుతుంది. 

ఓట్స్ :

Manam News

చాలా తేలిక పాటి ఆహారం ఇది. అతి తేలికగా జీర్ణమవుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మీ శక్తి స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. వీటిలో పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహకరిస్తాయి.  

Also Read :   హిట్లర్ సినిమాలో చిరంజీవికి సోదరిగా నటించిన ఈమె ఇప్పుడెలా ఉందో చూస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

చిలగడదుంప  :

Manam News

చిలగడదుంపలో విటమిన్ ఏ ఉంటుంది. కంటి చూపును పెంచడంలో ఇవి ఉపయోగపడుతాయి. ఇవి ఎముకలను కూడా దృడంగా చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. దీనిని తినడం వల్ల శరీరంలో విటమిన్ ఏ లోపం ఉండదు. 

నేరేడుపండు :

Manam News

బాలింతలు నేరేడుపండ్లను తినవచ్చు. ఈ పండ్లలో పైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి పోటాషియం వంటి పోషకాలుంటాయి.  

Also Read :  వరుస సినిమాల్లో అల్లు అర్హ.. పవన్ కళ్యాణ్ సినిమాలోనూ ?

ఖర్జూరాలు :

Manam News

ఖర్జూరాలు చాలా ఆరోగ్యకరమైనవి అదేవిధంగా రుచికరమైనవి. వీటిలో ఫైబర్, కాల్షియం వంటి పోషకాలుంటాయి. వీటిరుచి మధురంగా ఉంటుంది. 

Also Read :  నా భర్త నన్ను దగ్గరకు రానివ్వడం లేదు..కారణం..!!

Visitors Are Also Reading