Home » Ugadi 2023 : ఉగాది నుంచి ఈ రాశుల వారికి ధనలాభం

Ugadi 2023 : ఉగాది నుంచి ఈ రాశుల వారికి ధనలాభం

by Anji
Ad

Ugadi 2023 : ఇంగ్లీషు వారికి జనవరి 01 ఎలాగో.. తెలుగు వారికి నూతన సంవత్సరం ఉగాది పర్వదినమనే చెప్పాలి. ఈ ఏడాది మార్చి 21న శుభకృత్ నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి.. శ్రీ శ్రీ శోభకృత్ నామ సంవత్సరానికి స్వాగతం పలకే రోజు మార్చి 22. ప్రతి ఏటా  చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఉగాది. ఈ పండుగ రోజు ప్రతీ ఒక్కరూ తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయని పంచాంగం చూపించుకుంటారు. ముఖ్యంగా ఆంగ్ల నూతన సంవత్సరానికంటే కూడా తెలుగు సంవత్సరానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా ఏ రాశి ఎవరిదో ముందే తెలుసుకోవాలి. 

Also Read :  Also Read :  Ugadi Rasi Phalalu 2023: శోభకృత్ నామ సంవత్సరంలో మీ జాతకం ఎలా ఉందో ఇలా తెలుసుకోండి

Advertisement

మిథున రాశి : 

మిథున రాశికి ఈ ఏడాది ఏర్పడే మహాయోగం చాలా ఉపయుక్తంగా ఉంటుంది.  బృహస్పతి మీ రాశి జాతకానికి సంబంధించి మంచి స్థానంలో ఉన్నారు. దీంతో నిరుద్యోగులకు ఉపాధి లభ్యం అవ్వడంతో పాటు ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. ఈ సమయంలో పిల్లల అభివృద్ధిలో పురోగతి ఉంటుంది. వ్యాపారం చేసేవారు వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు మరికొన్ని కొత్త బాధ్యతలను తీసుకుంటారు. అన్ని విధాలుగా ఈ సమయం కలిసి వస్తుంది.  

Also Read :  Happy Ugadi 2023 Wishes, Greetings, Messages Quotes, Subhakankshalu in Telugu తెలుగు ఉగాది శుభాకాంక్షలు

వృషభ రాశి :

Advertisement

ఈ రాశి వారి దశ తిరగబోతుందని చెప్పవచ్చు. వీరి జాతకంలో ఇప్పటికే గురుడు 5వ ఇంట్లో సంచరిస్తున్నాడ. ప్రేమ వివాహాలకు గురు, శుక్రుల కలయిక చాలా మంచిది. కొత్త భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించడంతో పాటు వీరి ప్రేమ జీవితం బాగుంటుంది. అదేసమయంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుందని చెప్పవచ్చు.  

సింహ రాశి : 

ఈ సింహరాశి వారికి అరుదైన రాజయోగం చాలా మేలు చేస్తుంది. ఎందుకు అంటే మీ రాశి నుంచి 8వ ఇంట్లో గజకేసరి రాజయోగాలు రూపొందుతున్నాయి. దీంతో ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరగడంతో పాటు వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. పరిశోధన రంగంతో సంబంధం ఉన్న వారికి ఈ సమయం చాలా అనుకూలమైందని చెప్పవచ్చు.

ధనుస్సు :

ఉగాది నుంచి ఈ రాశి వారికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. వీరి జాతకంలో 4వ ఇంట్లో రెండు రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. దీంతో ఆదాయం రెట్టింపు అవ్వడమే కాకుండా.. ఆరోగ్యం కూడా మెరుగు అవుతుంది. వ్యక్తిగతంలో అందరినీ ఆకట్టుకోవడంతో పాటు వారికి పూర్వీకుల ఆస్తి కలిసొచ్చే అవకాశముంది.  

మీన రాశి :

 ఈ ఏడాది మీన రాశిలో 5 గ్రహాలు కలువబోతున్నాయి. ఊహించని రీతిలో వారికి డబ్బు వచ్చి చేరుతుంది. ఒక్క విషయాన్ని మాత్రం మరిచిపోకూడదు. మీరు చేయాల్సిన ప్రయత్నాన్ని మాత్రం అస్సలు ఆపకూడదు. మీ ప్రయత్నం చేసిన తరువాత భగవంతుడి మీద భారం వేయాలి. ఆ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. 

Visitors Are Also Reading