ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పెగాసస్ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. హై ఓల్టేజ్ హీట్‌ను రాజేస్తున్నాయి. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి పెద్ద సంఖ్యలో జనాలు చనిపోవడంపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కల్తీ సారా తాగి చనిపోతే సహజ మరణాలు అని చెప్పడం దారుణం అని పేర్కొన్నారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అని పేర్కొన్నారు.
Advertisement
Advertisement
రాష్ట్రంలో అమ్ముతున్న కల్తీ మద్యం బ్రాండ్లపై ప్రధాని మోడీ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రులకు గతంలోనే లేఖలు రాశానని తెలిపారు. కల్తీ మద్యంపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేసారు. కల్తీ సారా మరణాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే పెగాసస్ ను తెరపైకి తెచ్చారని తెలిపారు. ఏపీ అసెంబ్లీలో అసలు ప్రజల సమస్యలపై చర్చ జరగడం లేదు అని, సమస్యల కంటే ఎక్కువగా బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Also Read : పార్టీ మారే విషయంపై కోమటిరెడ్డి క్లారిటీ..!