సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. అసలు జరిగింది ఏంటి ఆ వీడియోలో ఉంది నిజమేనా అని పట్టించుకోకుండా నెటిజన్లు ఆ వీడియోలను వైరల్ చేస్తూ ఉంటారు. కేవలం నెటిజన్లు మాత్రమే కాకుండా సెలబ్రెటీలు సైతం ఆ వీడియోలను షేర్ చేయడం గమనార్హం. ఇక ప్రస్తుతం కూడా నెట్టింట ఓ వీడియో తెగచక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఓ బుడ్డోడు కారు అద్దం తుడుస్తూ తన వాచితో కారుపై ఉన్న ఫాస్టాగ్ స్కాన్ చేస్తాడు.
Also Read: వివాహం ఏ వయసులో పెళ్లి చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా ?
Advertisement
ఆ తరవాత డబ్బులు అడకుండానే వెళ్లిపోతూ కనిపిస్తాడు. దాంతో ఆ పిల్లోడిని దగ్గరకు పిలిచి చేతికి ఉన్న వాచ్ ను పరిశీలించగానే అక్కడ నుండి పారిపోతాడు. ఇక పిల్లోడు కారుకు అంటించి ఉన్నా ఫాస్టాగ్ స్కానర్ ను స్కాన్ చేసినట్టు చూపిస్తారు. ఇక ప్రస్తుతం ఎదీక్కడ చూసినా ఇదే వీడియో కనిపిస్తోంది. దాంతో దీనిపై తాజాగా పేటిఎం స్పందించింది. అది ఫేక్ వీడియో అని కొట్టిపారేసింది.
Advertisement
Also Read: కొడుకు తో దిల్ రాజ్ ఫస్ట్ ఫోటో… నెట్టింట వైరల్…!
ఆ వీడియోలో నిజం లేదని చాలా సార్లు ట్రయల్స్ జరిపిన తరవాతనే ఫాస్టాగ్ ను తీసుకువచ్చామని తెలిపింది. ఇదిలా ఉండగా గతంలో టోల్ గేట్ ల వద్ద వాహనం ఆపి టోల్ చార్జీలను చెల్లించేవారు. కానీ 2021లో ఫాస్టాగ్ అనే స్కానర్ ఆప్షన్ ను తీసుకువచ్చారు. దాంతో టోల్ గేట్ వద్ద ఆగకుండా వెళుతుండగానే ఫాస్టాగ్ ద్వారా స్కాన్ అయ్యి డబ్బులు కట్ అవుతాయి. ప్రస్తుతం తొంభై వాహనాలు ఫాస్టాగ్ ద్వారానే డబ్బు చెల్లిస్తున్నాయి. ఫాస్టాగ్ బ్యాంక్ అకౌంట్ లేదా ఏదైనా వాలెట్ కు జతచేసుకోవచ్చు.
Also Read: బాలకృష్ణతో ఆ హీరోయిన్ సినిమా వదులుకోవడానికి కారణం ఏమిటో తెలుసా..?