Home » కొడుకు తో దిల్ రాజ్ ఫస్ట్ ఫోటో… నెట్టింట వైరల్…!

కొడుకు తో దిల్ రాజ్ ఫస్ట్ ఫోటో… నెట్టింట వైరల్…!

by AJAY
Ad

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సతీమణి తేజస్విని ఈరోజు మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు మొదటి భార్య అనిత 2017వ‌ సంవత్సరంలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత చాలా ఏళ్ల పాటు దిల్ రాజు ఒంటరి జీవితాన్ని గ‌డిపారు.

Advertisement

దిల్ రాజు దంపతులకు ఒక కుమార్తె ఉండగా త‌న భార్య‌ అనిత బ్రతికి ఉన్నప్పుడే కూతురి వివాహం చేశారు. ప్రస్తుతం దిల్ రాజు కూతురు కూడా ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే దిల్ రాజు ఒంటరిగా ఉన్న నేపథ్యంలో ఆయన కూతురు వివాహం చేసుకోవాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు 2020లో తేజశ్వినిని రెండవ వివాహం చేసుకున్నారు. వీరు పెళ్లి సింపుల్ గా గుడిలో చేసుకున్నారు. కానీ పెళ్లి తర్వాత దిల్ రాజు తన భార్యతో కలిసి టాలీవుడ్ లోని స్టార్ హీరోలకు, హీరోయిన్ ల‌కు గ్రాండ్ పార్టీని ఇచ్చారు.

Advertisement

ఇదిలా ఉంటే ఇప్పుడు దిల్ రాజుకు వారసుడు వచ్చాడు. తన కొడుకుని ఎత్తుకుని దిల్ రాజు ఫోటో దిగారు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట‌ వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోలో దిల్ రాజు ముఖంలో ఆనందం వెలిగిపోతోంది. సినిమాల విష‌యానికి వ‌స్తే దిల్ రాజు ప్ర‌స్తుతం త‌మిళ స్టార్ హీరో విజయ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. అంతే కాకుండా రామ్ చ‌ర‌ణ్ శంక‌ర్ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్నాయి.

Visitors Are Also Reading