Home » ర‌వితేజ ధ‌మాకా మూవీలో పాయ‌ల్ ఐటెం సాంగ్

ర‌వితేజ ధ‌మాకా మూవీలో పాయ‌ల్ ఐటెం సాంగ్

by Bunty
Ad

మాస్ మ‌హారాజ ర‌వితేజ వ‌రుస సినిమా లతో దుసుకుపోతున్నాడు. వరుసగా సినిమాల గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ స్పీడ్ పెంచేసాడు. ఇప్ప‌టికే రామ రావు ఆన్ డ్యూటీ, ఖిలాడీ సినిమాల షూటింగ్ లు పూర్తి చేసుకుని విడుద‌లకు సిద్ధం గా ఉన్నాయి. ఈ రెండు సినిమాలు వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి లో విడుద‌ల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ర‌వితేజ‌ మ‌రి కొన్ని సినిమాలు కూడా షూటింగ్ లు జరుపుకుంటున్నాయి. కాగ తాజా గా మ‌రో సినిమా కు ర‌వితేజ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. న‌క్కిన త్రినాథ రావు ద‌ర్శ‌కత్వం లో ధ‌మాకా అనే సినిమా లో హీరో గా న‌టిస్తున్నాడు. కాగ ఈ సినిమా లో ఐటెం సాంగ్ పెట్టాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది.

Advertisement

Advertisement

ఈ ఈ ఐటెం సాంగ్ లో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయ‌ల్ రాజ్ పుత్ ను ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలుస్తుంది. కాగ ఈ ఐటెం సాంగ్ లో న‌టించ‌డానికి ముందుగా ఇత‌ర న‌టీలు తీసుకున్నార‌ని ప్ర‌చారం సాగింది. కానీ చివ‌రికి పాయ‌ల్ రాజ్ పుత్ నే చిత్ర బృందం ఫైన‌ల్ చేసింది. కాగ ఈ ఐటెం సాంగ్ లో మొద‌ట యాంక‌ర్ అన‌సూయను తీసుకున్నార‌నే పుకార్లు వ‌చ్చాయి. అలాగే హీరోయిన్ ఈషా రెబ్బ ను ఎంపిక చేస్తున్న‌ట్టు కూడా వార్తలు వ‌చ్చాయి. కానీ చివ‌ర‌కు ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ పాయ‌ల్ రాజ్ పుత్ కే చిత్ర యూనిట్ మొగ్గు చూపార‌ని స‌మాచారం. కాగ ఈ ధ‌మాకా సినిమా లో ర‌వితేజకు జోడీ గా శ్రీ‌లీల న‌టిస్తుంద‌ని తెలుస్తుంది. ఇదిలా ఉండ‌గా గ‌తంలో డిస్కో రాజా అనే సినిమా లో పాయల్ రాజ్ పుత్ ర‌వితేజ తో కలిసి న‌టించింది.

Visitors Are Also Reading