హైదరాబాద్ నగర నడిబొడ్డున పైవ్ స్టార్ హోటల్లోని పబ్‌లో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం.. పలువురిని అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూప్లాజా హోటల్లోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో టాస్క్ పోర్స్ పోలీసులు దాడులు జరిపి పార్టీలో పాల్గొన్న 148 మందిని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం వారిని వదిలేశారు. వారి వద్ద స్వాధీనం చేసుకున్న మత్తు మందులను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు.
Advertisement
ఇందులో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక పేరు వినిపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మెగాస్టార్ కుటుంబం ఉన్నట్టుండి ఒక్కసారి షాక్‌కు గురైంది. వెంటనే నాగబాబు దీనిపై స్పందించి ఓ వీడియోను విడుదల చేశారు. డ్రగ్స్ కేసులో నిహారికకు సంబంధమే లేదని పోలీసులు చెప్పినట్టు తెలిపారు. నిహారిక విషయంలో తాము క్లియర్‌గా ఉన్నట్టు ఆయన వెనకేసుకొచ్చారు. వాస్తవాల సంగతిని పక్కన పెడితే అవాంఛనీయ ఘటనలో నిహారిక పేరు తెరపైకి రావడం తండ్రిగా నాగబాబు ఆవేదన అర్థం చేసుకోవచ్చు.
Advertisement
Also Read : ప్రభాస్ రాబోయే సినిమాల గురించి వేణు స్వామి ఏమన్నారంటే..?
ఇక నిహారిక విషయం సోషల్ మీడియా చర్చ జరగుతున్న సందర్భంలో ఆమె బాబాయ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో నిహారికకు క్లాస్ తీసుకుంటున్నట్టుగా తన అభిప్రాయం వ్యక్త పరిచారు. ఎస్సీ,బీసీలు కలిసి రాజ్యాధికారాన్ని సాధించేందుకు రామ్ మనోహర్ లోహియా ఆలోచనలను పంచుకుంటూ రచయిత వాకాడ శ్రీనివాస్ కోట్‌ను తాను ప్రస్తావిస్తున్నట్టు పేర్కొన్నారు పవన్. ముఖ్యంగా శత్రువులు కూడా మనలను వాడుకోగలిగేంత మూర్ఖత్వం మనది. అవతలివాడు మనల్ని వాడుకోవడమే మన విజయమని భ్రమ పడేంత అమాయకత్వం మనదని ట్వీట్ చేశారు.
పవన్ చేసిన ఈ ట్వీట్ ప్రముఖుల పిల్లల డ్రగ్స్ వ్యవహారంపైనే అని చర్చ కొనసాగుతుంది. తన అన్న కుమార్తె నిహారిక పేరుపై రచ్చ సాగుతుండడంపై పవన్ తన అసహనాన్ని పరోక్షంగా వెల్లడించినట్టు చెబుతున్నారు. ఇటువంటి వాటి వల్ల ప్రత్యర్థులకు మనమే ఆయుధం ఇచ్చినట్టు అయిందని పవన్ ట్వీట్ సారాంశంగా పేర్కొంటున్నారు. ముఖ్యంగా డ్రగ్స్ వ్యవహారంలో నాగబాబు చెబుతున్నట్టు నిహారికకు సంబంధం లేకపోయినా ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు అవకాశం ఇచ్చినట్టు అయిందని పవన్ ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.
Also Read : పేషెంట్ తీసుకొస్తుండగా అంబులెన్స్‌లో ఇంధనం అయిపోయింది.. ఎక్కడంటే..?