పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా విడుదల అంటే మెగా అభిమానులకు పండుగ వాతావరణం. తమ ఆరాధ్య నటుడి సినిమా విడుదల అవుతుందంటే రెండు, మూడు రోజుల ముందు నుంచి ఫ్యాన్స్ హంగామా కనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ కోట్లాది మంది అభిమానుల కోలాహలం మధ్య భీమ్లానాయక్ సినిమా విడుదల అయింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారాకరామారావుకు పవన్ కల్యాణ్ లేఖ రాశారు.
Also Read : IPL 2022 : ఈసారి ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు.. రెండు గ్రూపులుగా లీగ్ మ్యాచ్‌లు..!
Advertisement
కళను హక్కున చేర్చుకుని అభినందించడానికి ప్రాంతీయ, భాష, కుల, మత, భావ, వైరుధ్యాల అడ్డంకి కాబోవు అన్నారు. ఈ వాస్తవాన్ని మరొకసారి తెలియజెప్పిన తెలంగాణ రాష్ట్ర, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్‌కు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు లేఖలో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బయో ఆసియా అంతర్జాతీయ సదస్సులో బిల్ గేట్స్ తో కీలకమైన వర్చువల్ మీట్ కు సన్నద్ధమవుతూ బిజీగా ఉన్నా..సమయం వెసులుబాటు కల్పించుకుని భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Advertisement
ముఖ్యంగా ఎంత భావ వైరుధ్యులున్నా.. రాజకీయ విమర్శలు చేసుకున్న వాటిని కళకు, సంస్కృతిని అంటనీయకపోవడం తెలంగాణ రాజకీయ నేతల శైలిలో ఉంది. ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రతీ సంవత్సరం నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమంలో అన్ని పక్షాల వారు ఉండడాన్ని చూస్తాం. అటువంటి ఆత్మీయత కేటీఆర్‌లో కనిపిస్తుంది. సృజనాత్మకత, సాంకేతికతల మేళవింపుతో కొనసాగే సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తూ.. ఈ రంగం అభివృద్ధికి ఆలోచనలను కేటీఆర్ చిత్తశుద్దితో పంచుకున్నారు. కేటీఆర్‌తో పాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కూడా కృతజ్ఞతలు తెలిపారు పవన్ కల్యాణ్.
Also Read : WWE లో హార్దిక్ పాండ్య దర్శనం..? ఫోటోలు వైరల్..!