Home » పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ రీరిలీజ్ ట్రైలర్ చూశారా ? 

పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ రీరిలీజ్ ట్రైలర్ చూశారా ? 

by Anji

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఓ వైపు రాజకీయాల్లో, మరోవైపు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తమిళ దర్శకుడు కమ్ యాక్టర్ ఎస్.జే.సూర్య తెరకెక్కించిన ఈ సినిమా పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

ఈ సినిమాలో పవన్ కి జోడీగా భూమిక నటించగా.. సపోర్టింగ్ రోల్ లో శివాజీ, అలీ కనిపించారు. ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఇప్పటికీ జనం పాడుకుంటూనే ఉన్నారు. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్, ఇద్దరి మధ్య గిల్లికజ్జాలు, కెమిస్ట్రీ అన్ని కూడా ఖుషిని క్లాసిక్ మూవీగా మార్చాయి. ప్రస్తుతం ఇలాంటి ఓల్డ్ క్లాసిక్ సినిమా అభిమానుల కోసం రీరిలిజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఖుషి మేకర్స్ రీరిలీజ్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్  ప పవన్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 31, 2022న రీరిలీజ్ చేస్తున్నారు. ఖుషి సినిమాను కూడా టెక్నాలజీ హంగులు చేర్చి.. 4కే రిజల్యూషన్ 5.1 డాల్బీ ఆడియోతో రీరిలీజ్ చేయనున్నారు. పవన్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. 

Also Read :  “మసూద” సినిమాలో దయ్యం పట్టినట్టు నటించిన ఈ నటి ఎవరో తెలుసా?

Manam News

 వాస్తవానికి పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా రీమెక్. తమిళ స్టార్ విజయ్, జ్యోతిక జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఎస్.జే.సూర్యనే దర్శకత్వం వహించాడు. తమిళంలో సక్సెస్ కావడంతో తెలుగులో ఆయన పవన్ తో తీశాడు.హిందీలో కూడా ఫర్దీన ఖాన్, కరీనా కపూర్ జంటగా రీమేక్ చేశారు. తెలుగు, తమిళ వెర్షన్ మాత్రమే సక్సెస్ సాధించాయి. తెలుగు వెర్షన్ ఖుషి సినిమాకి నిర్మాత ఏ.ఎం.రత్నం కాగా.. మణిశర్మ సంగీతం అందించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ స్థాయిలోఈ సినిమాని రీరిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు పవన్ అభిమానులకు మరో శుభవార్త చెప్పనున్నారు. ఖుషి నిర్మాత ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్న హిస్టారికల్ ఫిలిం హరి హరవీరమల్లు సినిమా నుంచి నూతన సంవత్సరం సందర్భంగా సర్ ప్రైజ్ గిప్ట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. 

Also Read :   కాంతార 2 లో జరగబోయేది ఇదేనా..? ఇది నిజమైతే నెక్స్ట్ లెవెల్ ..!!

Visitors Are Also Reading