Home » “మసూద” సినిమాలో దయ్యం పట్టినట్టు నటించిన ఈ నటి ఎవరో తెలుసా?

“మసూద” సినిమాలో దయ్యం పట్టినట్టు నటించిన ఈ నటి ఎవరో తెలుసా?

by Bunty
Ad

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, మళ్లీ రావా, థ్రిల్లర్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ వంటి విభిన్న కథలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వచ్చిన చిత్రం మసూద. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, సత్యం రాజేష్ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. నవంబర్ 18 న మసూద ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని సంపాదించుకుంది.

Advertisement

Advertisement

ఇక ఈ సినిమాలో నాజియా క్యారెక్టర్, మసూద్ క్యారెక్టర్ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. ఇక ఈ సినిమాలో నాజియా క్యారెక్టర్ లో నటించిన నటి ఎవరు, ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయాల గురించి పెద్ద ఎత్తున చర్చలు మొదలుపెట్టారు. అయితే నాజియా క్యారెక్టర్ లో నటించిన నటి పేరు బాంధవీ శ్రీధర్.

 

గుంటూరు జిల్లాకు చెందిన బాంధవి మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి అనంతరం మసూద సినిమాలో అవకాశాన్ని అందుకున్నారు. 2019లో మిస్ ఇండియా రన్నరప్ గా నిలిచిన బాంధలి, అదే ఏడాది మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్, మిస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ పోటీలలో విజేతగా నిలబడ్డారు. ఇక తన తండ్రి గత 20 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేయటం వల్ల తనకు కూడా నటనపై ఆసక్తి కలిగిందని వారి ప్రోత్సాహంతోనే మోడలింగ్ రంగంలోకి వెళ్లానని తెలిపారు.

Visitors Are Also Reading