Home » పవన్‌ కల్యాణ్‌ ‘బ్రో’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ?

పవన్‌ కల్యాణ్‌ ‘బ్రో’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ?

by Anji
Ad

భీమ్లానాయక్ వంటి హిట్ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం బ్రో. సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మరో కీ రోల్ పోషించాడు. ఇందులో కేతిక శర్మ, ప్రియాంక వారియర్ హీరోయిన్స్ గా నటించారు. తమిళంలో సూపర్ హిట్ సాధించిన వినోదయ సీతమ్ రీమేక్ గా బ్రో రూపొందింది. భారీ అంచనాలతో జులై 28న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

bro-review

Advertisement

మామా, అల్లుళ్లు మొదటి సారి కలిసి నటించారు. మొదటి రోజు బాగానే ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఆ తరువాత రోజు నుంచి కలెక్షన్లు కాస్త తగ్గాయి. ఇందులో పవన్ లుక్,స్టైల్, యాక్టింగ్, మేనరిజమ్స్, పవర్ స్టార్ ఓల్డ్ బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్.. ఇలా అన్నీ అంశాలు పవన్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. విరూపాక్ష మూవీతో వంద కోట్ల క్లబ్ లో చేరిన సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలోనూ సెటిల్డ్ పెర్ఫామెన్స్ తో మెప్పించాడు. సినిమాలోని ఎమోషనల్ కంటెంట్ కి మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో బ్రో ఓటీటీ రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. 

Advertisement

బ్రో మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఆగస్టు 25 నుంచి నెట్ ఫ్లిక్స్ లో బ్రో స్ట్రీమింగ్ కానుంది. ముందుగా పవన్ కళ్యాణ్ బర్త్ డేను పురస్కరించుకొని సెప్టెంబర్ 2న బ్రో సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారని వార్తలు వచ్చాయి. వారం రోజుల ముందే ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. మెగా ఫ్యాన్స్ కి ముందే ట్రీట్ రానుందన్న మాట. బ్రో సినిమాకి థమన్ స్వరాలు సమకూర్చారు. పీపుల్స్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. పవన్ సినిమాలోని శ్యాంబాబు క్యారెక్టర్ పై దుమారం రేగిన సంగతి తెలిసిందే. రాజకీయంగా సెన్షేషన్ సృష్టించిన బ్రో మూవీని థియేటర్లలో మిస్ అయితే ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

డబుల్ రోల్ చేసి ఏ హీరో ఎన్ని సక్సెస్ లు సాధించారో తెలుసా ?

బాలకృష్ణని దర్శకుడు అనిల్ రావిపూడి అంతలా మార్చేశాడా ?

Visitors Are Also Reading