Home » మ‌రో ద‌ర్శ‌కుడికి ప‌వ‌న్ గ్నీన్ సిగ్న‌ల్…!

మ‌రో ద‌ర్శ‌కుడికి ప‌వ‌న్ గ్నీన్ సిగ్న‌ల్…!

by AJAY
Ad

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలు రాజ‌కీయాల‌ను బ్యాలెన్స్ చేస్తున్నారు. ఓవైపు రాజ‌కీయాల్లో చురుకుగా ఉంటూనే ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోవైపు సినిమాలు చేస్తున్నారు. త్వ‌ర‌త్వ‌ర‌గా సినిమాలు చేస్తూ ప‌వ‌న్ విడుద‌ల‌కు సిద్దం అవుతున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయ‌క్ సినిమా ఇప్ప‌టికే ఈ విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. ఈ నెల‌లోనే ఈ చిత్రం విడుద‌ల కానుంది.మ‌రోవైపు ప‌వ‌న్ క్రిష్ కాంబోలో చేస్తున్న సినిమా 50శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ సినిమా కూడా ఈ యేడాదే విడుద‌ల కానుంది.

Advertisement

PAWAN KALYAN

PAWAN KALYAN

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే హ‌రీష్ శంక‌ర్ తో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ అనే సినిమాకు ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఈ సినిమా త‌ర‌వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ సురేంద‌ర్ రెడ్డితో ఓ సినిమా చేస్తున్న‌ట్టు అనౌన్స్ చేశారు. అయితే ఈ చిత్రం త‌ర‌వాత కూడా ప‌వ‌న్ సినిమా ఫిక్స్ అయ్యింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ర‌వాత సినిమా ఖిలాడీ సినిమా ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో ఫిక్స్ అయిన‌ట్టు స‌మాచారం దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రానుందట‌. మ‌రి ఇందులో ఎంత‌వ‌ర‌కూ నిజం ఉందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Visitors Are Also Reading