పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ఎలాగో ఇప్పటివరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అంత క్రేజ్. సినిమా హిట్ ప్లాప్ అటు పక్కకి పెడితే పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ అలాంటిది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైతే అభిమానులు థియేటర్ల వద్ద కేరింతలతో హడావిడి మామూలుగా ఉండదు. అలాంటి హీరో ఇప్పటివరకు ఎన్నో హిట్ సినిమాలు తీసి మంచి పేరే సంపాదించుకున్నారు. ఎంతో మందికి లైఫ్ ని ఇచ్చారు. ఇటీవల పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమాలో కిన్నెర మొగులయ్య కి అవకాశం కల్పించడంతో ఆయన ప్రతిభ గుర్తించి భారత ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డును ఇవ్వడం విశేషం.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల కంటే ఎక్కువగా తాను స్థాపించిన జనసేన పార్టీకి, రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏపీలో 2024లో ఎలాగైనా అధికారంలోకి రావాలని, పార్టీ బలోపేతం చేసే దిశలో కృషి చేస్తున్నారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటికీ మూడు సంవత్సరాల పాటు సినిమాలతో గడిపేశాడు. ఇక ఆ తరువాత వకీల్ సాబ్, భీమ్లానాయక్ వంటి హిట్ చిత్రాలు తీసి అందరిచేత మన్ననలు పొందారు. హరిహర వీరమల్లు మూవీ సెట్స్ పై ఉండగా.. మరో మూడు సినిమాలను ప్రకటించారు. అయితే ఎన్నికలకు ఏడాదిన్నర సమయం మాత్రమే ఉండడంతో పవన్ కళ్యాణ్ సినిమాలకంటే ఎక్కువ రాజకీయానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంతో పోల్చితే ఇప్పుడు పార్టీ బలపడిందనే సమయంలోనే రెండు జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలో అసలు జనసేన పార్టీ ప్రస్తావన లేకుండా పోయింది.
Advertisement
Advertisement
ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే వైసీపీ 18, టీడీపీ 07 ఎంపీ సీట్లు గెలుచుకుంటాయని ఇండియాటూడే సర్వే చెప్పగా.. మరోసారి ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని సర్వే ప్రకారం వెల్లడి అయింది. 120 నుంచి 130 వరకు అసెంబ్లీ సీట్లు గెలుచుకుని ఏపీలో అధికారంలోకి వైసీపీ వచ్చే అవకాశం ఉందని సర్వే చెబుతుంది. ఇక ఈ సర్వే ప్రకారం.. ఇటు బీజేపీకి,. అటు జనసేన పార్టీకి ఒక సీటు కూడా రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నా సినిమాలు ఇప్పటికే షూటింగ్ కొంత మేరకు పూర్తి అయినప్పటికీ ఈ చిత్రాలను పూర్తి చేసే ఆలోచన ఆయనకు లేదన్నట్టు కనిపిస్తోంది. 2024 వరకు పవన్ నుంచి సినిమా రావడం కష్టమని స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక మరోవైపు రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు.. అక్టోబర్ 05 నుంచి ఏపీలో బస్సుయాత్ర ప్రకటించిన విషయం విధితమే. ఇప్పటి నుంచే ఆయన పూర్తిగా షూటింగ్‌కి హాజరైన చాన్స్ ఉండదు. ఈ పరిస్థితి చూస్తే మాత్రం పవన్ సినిమాలకు దూరమవుతారనే విషయం అర్థమవుతోంది. ఈ తరుణంలోనే హరిహర వీరమల్లు నిర్మాతల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టు అర్థమవుతోంది. అదేవిధంగా భవదీయుడు భగత్ సింగ్ నిర్మాతగా ఉన్నటువంటి మైత్రి మూవీ మేకర్స్ ఆయన ఇచ్చినటువంటి రూ.40కోట్లు తిరిగి ఇచ్చేయాలని పవన్ కళ్యాన్ ని కోరుతున్నారట. ఈ తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఎటు తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. పవన్ సినిమాలు తీస్తారా..? లేక పూర్తి స్థాయిలోనే రాజకీయాల్లో కొనసాగుతారా అనేది వేచి చూడాలి.
Also Read :
కెరీర్ లో ఫ్లాప్ చూడని 7గురు టాలెంటెడ్ దర్శకులు వీళ్లే..!