Home » Pawan Kalyan : పవన్ కళ్యాణ్, విజయ్ కాంబోలో మిస్ అయిన ఈ మూవీ గురించి తెలుసా? ఎందుకు రిలీజ్ కాలేదంటే?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్, విజయ్ కాంబోలో మిస్ అయిన ఈ మూవీ గురించి తెలుసా? ఎందుకు రిలీజ్ కాలేదంటే?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కు, కోలీవుడ్ లో విజయ్ కు లెక్కలేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఇండస్ట్రీలో ఫాన్స్ వీరిని దేవుళ్ళలా ఆరాధిస్తారు. ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం స్టార్ హీరోలు చాలా కష్టపడతారు. ఆ అదృష్టం వీరిద్దరిని వరించిందని చెప్పవచ్చు. అంతేకాదు.. ఈ ఇద్దరు హీరోలకి ఒకరంటే ఒకరి చాలా అభిమానం ఉంది. ఆ విషయాన్నీ ఈ ఇద్దరు హీరోలతో కలిసి పని చేసిన దర్శకుడు అరుణ్ ప్రసాద్ చెప్పడం విశేషం.

Advertisement

ఈ ఇద్దరి హీరోల మధ్య మంచి బాండింగ్ ఉంది. దీనితో వీరిద్దరిని స్టార్స్ గా పెట్టి ఒక మంచి మల్టీస్టారర్ సినిమా తీయాలని ఎస్ జె సూర్య గతంలో భావించారు. ఈ విషయమై ఇటు పవన్ కళ్యాణ్ తోనూ, అటు విజయ్ తోనూ చర్చలు కూడా జరిపారట. అందుకు ఈ ఇద్దరు హీరోలు కూడా ఒప్పుకున్నారట. కానీ, పవన్ కళ్యాణ్ – ఎస్ జె సూర్య కాంబో లో వచ్చిన కొమరం పులి సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ గా నిలిచిందో చెప్పక్కర్లేదు.

Advertisement

దీనితో, ఎస్ జె సూర్య వెనక్కి తగ్గారట. భారీ అంచనాలతో విడుదలైన కొమరం పులి సినిమా డిజాస్టర్ అవ్వడంతో, ఎస్ జె సూర్య సినిమాలకు దర్శకత్వం వహించడం మానేశారు. దీనితో పవన్- విజయ్ ల మల్టి స్టారర్ సినిమా సంగతి మరుగున పడిపోయింది. ఇకపై వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఒప్పుకున్న రెండు సినిమాల తరువాత విజయ్ సినిమాలకు దూరం అయ్యి, రాజకీయాల వైపు వెళ్తారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి సినిమాలో నటిస్తారు అన్నది కలగానే మిగిలిపోవచ్చు.

మరిన్ని..

ఈ సీరియల్ హీరోల రెమ్యునరేషన్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోడం పక్కా..!

డిస్కో శాంతి దగ్గర శ్రీహరి తీసుకున్న మాట ఏంటి ? రెండు సార్లు పెళ్లి ఎందుకు ?

టాలీవుడ్ కమెడియన్స్ రోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా ?

Visitors Are Also Reading