Home » పవన్ కళ్యాణ్ “తమ్ముడు” మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…?

పవన్ కళ్యాణ్ “తమ్ముడు” మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…?

by Bunty
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు మన అందాల ముద్దుగుమ్మ ప్రీతి జింగానియా. తెలుగులో కన్నా ముందు తమిళ, మలయాళ సినిమాల్లో నటించింది అందాల ముద్దుగుమ్మ ప్రీతి జింగానియా. కానీ తమ్ముడు సినిమాతో వచ్చినంత క్రేజ్ మరే సినిమాకి రాలేదు. తమ్ముడు సినిమా అనంతరం ఈ భామకి వరుస సినిమాలు క్యూ కట్టాయి.

Advertisement

తమ్ముడు సినిమా తర్వాత అధిపతి, నరసింహనాయుడు, అప్పారావు డ్రైవింగ్ స్కూల్, విశాఖ ఎక్స్ప్రెస్ వంటి సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ జూనియర్ ఎన్టీఆర్ సరసన కూడా యమదొంగ సినిమాలో ఓ సాంగ్ లో కనిపించి మెప్పించింది. ఈ అమ్మడు హిందీలో ఎక్కువ సినిమాలు చేసింది. కన్నడ, ఉర్దూ, పంజాబీ భాషల్లోనూ కూడా నటించింది ఈ అమ్మడు. 2008లో పర్వీన్ ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.

Advertisement

పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమై కుటుంబ బాధ్యతలు నిర్వర్తించింది ప్రీతి జింగానియా. సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండేది. తనకు తన కుటుంబానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. 42 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఏ మాత్రం చెక్కుచెదరని అందంతో ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా ఉంటుంది. వరుస ఫోటోషూట్లు చేసుకుంటూ తన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది.

ఇవి కూడా చదవండి

చికెన్ లివర్ తింటున్నారా… అయితే ఈ షాకింగ్ నిజాలను తెలుసుకోండి ?

యువరాజ్ సింగ్ ఫ్యామిలీకి బెదిరింపులు.. మహిళ అరెస్ట్

హీరోయిన్ పై కామెంట్స్ చేసిన హీరో రాజశేఖర్… కట్ చేస్తే సినిమా నుంచి ఔట్…!

Visitors Are Also Reading