Home » షారుఖ్ ఖాన్ తర్వాత పవన్ కళ్యాణ్ మాత్రమే.. రెమ్యూనరేషన్ విషయంలో రికార్డ్ !

షారుఖ్ ఖాన్ తర్వాత పవన్ కళ్యాణ్ మాత్రమే.. రెమ్యూనరేషన్ విషయంలో రికార్డ్ !

by Bunty
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ అంతా ఇంతా కాదు. వరుస సినిమాలతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు దూసుకుపోతున్నాడు. ఇటు సినిమాలు మరియు అటు రాజకీయాలు ఇలా రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సుజిత్ అనే డైరెక్టర్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకు డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

ఈ మూవీలో తమిళ హీరోయిన్ ప్రియాంక అరుల్.. పవన్ కళ్యాణ్ సరసన రొమాన్స్ చేయనుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు రీమిక్స్ సినిమాలు చేశారు. అయితే ఈ సినిమా.. ఎలాంటి రీమేక్ లేకుండా డైరెక్ట్ మూవీ అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ సినిమా కావడంతో డివివి కూడా 100 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడని టాక్. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ సంచలన రికార్డు సృష్టించాడు.

Advertisement

పవన్ కళ్యాణ్…ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు చేయలేదు. ఆయన అన్ని ప్రాంతీయ భాషా సినిమాలే చేశాడు. అయినప్పటికీ ఓ పాన్ ఇండియా స్టార్ లెవెల్ లో పవన్ కళ్యాణ్ కు ఏకంగా 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుతోంది. అంటే బాలీవుడ్ హీరోలతో సమానంగా పవన్ కళ్యాణ్… రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. సల్మాన్ ఖాన్ మరియు షారుక్ ఖాన్ మాత్రమే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ తర్వాత కేవలం తెలుగు మార్కెట్లో 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా పవన్ కళ్యాణ్ చరిత్రలోకి ఎక్కాడు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

టీవీ సీరియల్స్ హీరోయిన్స్ ఎంత చదువుకున్నారో తెలుసా…?

కిమ్ కు భయంకరమైన వ్యాధి… బరువు 140 కిలోలు పెరిగాడా!

Sanghavi: ఒకప్పటి హీరోయిన్ సంఘవి ఇప్పుడెలా ఉందో తెలుసా ?

Visitors Are Also Reading