తాజాగా విరూపాక్ష సినిమాతో ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కు మంచి కం బ్యాక్ ఇవ్వడమే కాకుండా ప్రేక్షకులకు కూడా ఓ మంచి సినిమా చూసాం అన్న తృప్తిని అందించింది. మరో పక్క నిర్మాతలకు కూడా మంచి బిజినెస్ ను చేసి పెట్టింది. అయితే ఈ సినిమా డైరెక్టర్ కార్తీక్ వర్మ హీరో సాయి ధరమ్ తేజ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
Advertisement
ఈ సినిమా సక్సెస్ గురించిన మాటల్లో భాగంగా డైరెక్టర్ కార్తీక్ సాయి ధరమ్ తేజ్ గురించి కూడా పలు విషయాలు చెప్పారు. తేజ్ కు ఆక్సిడెంట్ అయినప్పటి పరిస్థితి గురించి, ఆ రోజు హాస్పిటల్ లో పరిస్థితి గురించి ఆయన వివరించారు. నాలుగు రోజుల్లో విరూపాక్ష షూట్ ఉందనగా, ఆఫీస్ లో షూటింగ్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నామని, ఆ టైం లో ఆఫీస్ బాయ్ వచ్చి న్యూస్ చూడమని చెప్తే, న్యూస్ లో తేజ్ ఆక్సిడెంట్ గురించి చూసి షాక్ అయ్యామన్నారు.
Advertisement
ఆ షాక్ లోనే హాస్పిటల్ కి వెళ్ళాం. అక్కడ మెగాస్టార్, పవన్ కళ్యాణ్, నాగబాబు, మీడియా ఇంకా చాలా మంది జనాలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ అయితే చాలా ఏడ్చేశారని కార్తీక్ చెప్పారు. తేజ్ కళ్ళు తెరిచే వరకు హాస్పిటల్ నుంచి కదిలేది లేదని చాలా ఎమోషనల్ అయ్యారు. డాక్టర్ వచ్చి పరిస్థితి చెప్పి, కోలుకోవడానికి టైం పడుతుందని అన్నారు. ఆ రాత్రంతా పవన్ కళ్యాణ్ అక్కడే కూర్చున్నారని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్-తేజ్ ల మధ్య బాండింగ్ మరోసారి వైరల్ అయ్యింది. గతంలో కూడా ఎన్నోసార్లు పవన్ మావయ్య నా గురువు అని తేజ్ చెప్తూ వచ్చారు. వారి మధ్య బాండింగ్ గురించి అందరికి తెలిసిందే.
మరిన్ని ముఖ్య వార్తలు:
డబ్బు కోసమే వరుణ్ తేజ్ లావణ్యను పెళ్లి చేసుకుంటాడా…? తెరపైకి షాకింగ్ సీక్రెట్..!
అప్సర కేసులో అదిరిపోయే ట్విస్ట్! ఇది అస్సలు ఊహించలే కదా ?
మహిళా క్రికెటర్లను పెళ్లి చేసుకున్న ఆటగాళ్లు వీళ్ళే.. ధోని శిష్యుడితో సహా ఎవరెవరంటే?