Home » పవన్ కళ్యాణ్ మూవీలో గెస్ట్ రోల్ చేయనున్న తమిళ స్టార్ హీరో..?

పవన్ కళ్యాణ్ మూవీలో గెస్ట్ రోల్ చేయనున్న తమిళ స్టార్ హీరో..?

by Anji
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో వస్తున్న మూవీ  ఓజి. ఈ చిత్రం  మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక ఇలాంటి తరుణంలోనే ఈ సినిమాలో మరొక స్టార్ హీరో కూడా యాడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఆయన ఎవరు అంటే.. తమిళ ఇండస్ట్రీకి చెందిన సూర్య. ఇందులో ఒక చిన్న గెస్ట్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే సూర్య.. కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీలో చేసిన ఒక చిన్న పాత్ర రోలెక్స్ ఎంత పాపులర్ అయిందో  దాదాపు  అందరికీ  తెలిసిందే.


ఇక ఇప్పుడు కూడా ఓజీ సినిమాలో కూడా ఒక చిన్న పాత్ర చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా 10 నిమిషాల నిడివితో ఉండనున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఈ సినిమాలో ఒక కీలకపాత్ర ఉండటంతో అందులో భాగంగానే సూర్య అయితే ఈ పాత్రకి బాగుంటుందని డైరెక్టర్ సూర్యని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే అది సస్పెన్స్ గా ఉంచి థియేటర్ లోనే ఈ క్యారెక్టర్ ని ఓపెన్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. అందుకే బయట ఎక్కడ కూడా ఈ క్యారెక్టర్ కి సంబంధించిన విషయాలు తెలియజేయడం లేదు.

Advertisement

Advertisement

ఇక వాస్తవానికి  సూర్య చేస్తున్న ఈ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుందని లీకేజీలు అయితే అందుతున్నాయి. ఇప్పటికే సూర్యకి సంబంధించిన ఎపిసోడ్ ని షూట్ చేసి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక సూర్య కూడా ఐదు రోజులు ఈ సినిమా కోసం తన డేట్స్ కేటాయించినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో వస్తుంది కాబట్టి, ఈ సినిమాలో సూర్యుని తీసుకుంటే తమిళ్ మార్కెట్ కూడా బాగా వర్క్ అవుట్ అవుతుందనే ఉద్దేశంతోనే డైరెక్టర్ సూర్యని తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి!       తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading