Home » ఆహాకు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్…అదే జ‌రిగితే ఊరుకోం అంటూ..?

ఆహాకు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్…అదే జ‌రిగితే ఊరుకోం అంటూ..?

by AJAY
Ad

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా ఆహా పేరే వినిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగులో చాలా టాక్ షోలు వ‌చ్చాయి. కానీ ఆహా లో ప్రారంభించిన అన్ స్టాప‌బుల్ విత్ ఎన్బీకే మాత్రం నెవ్వ‌ర్ బిఫోర్ అనేలా ఉంది. అంతే కాకుండా ఓ స్టార్ హీరో హోస్ట్ గా చేస్తున్నాడు అంటే అది మామూలు మ్యాట‌ర్ కాదు. ఈ నేప‌థ్యంలోనే బాల‌య్య‌కు ఉన్న క్రేజ్ తో ఒక్క‌సారిగా ఆహా క్రేజ్ మ‌రియు అన్ స్టాప‌బుల్ టాక్ షోకు క్రేజ్ ఎక్క‌డికో వెళ్లిపోయాయి.

Advertisement

ఇక బాల‌య్య టాక్ షోకు రావ‌డానికి ఎవ్వ‌రు నో చెప్ప‌రు కాబ‌ట్టి స్టార్ హీరోలు ఈ షో లో ద‌ర్శ‌నం ఇస్తున్నారు. అంతే కాకుండా ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌ని వారు కూడా ఈ షో లో సంద‌డి చేస్తున్నారు. ఇక బాల‌య్య కూడా షో లో పెద్ద హీరోలా కాకుండా చాలా చ‌లాకీగా వ‌చ్చిన వారితో ఎంతో జోవియ‌ల్ గా ఉంటున్నారు.

Advertisement

అంతే కాకుండా జోకులు చేస్తూనే ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ షో కు రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్ట్ గా వ‌చ్చారు. ఇక ప్రభాస్ దెబ్బ‌తో ఆహా క్రాష్ అయిపోయింది. దాంతో నాలుగు వందల మంది క‌లిసి ఆ రోజు రాత్రి ప‌నిచేశామ‌ని ఆహా లో ప‌నిచేస్తున్న వ్య‌క్తి ప్ర‌క‌టించారు. మిలియ‌న్స్ మంది ఒకేసారి యాప్ లోకి రావ‌డంతో క్రాష్ అయ్యింద‌ని చెప్పారు. అయితే త్వ‌ర‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎపిసోడ్ కూడా విడుద‌ల కాబోతుంది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ఫ్యాన్స్ ముందే ఆహాకు వార్నింగ్ లు ఇస్తున్నారు. ప‌వ‌న్ ఎపిసోడ్ కు ఇంత‌కు మించి క్రేజ్ ఉంటుంద‌ని కాబ‌ట్టి ముందే టెక్నిక‌ల్ టీమ్ సిద్దంగా ఉండాల‌ని సోష‌ల్ మీడియాలో కామెంట్ లు పెడుతున్నారు.

Visitors Are Also Reading