పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరును…ఆయన ఇమేజ్ ను చిన్న హీరోలు తమ సినిమాల్లో వాడుకోవడం సర్వసాధారణం. అప్పట్లో నితిన్ హీరోగా వచ్చిన ప్రతి సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఉండేది. నితిన్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అందుకే ఆయన కు సంబంధించిన ఏదో ఒక అంశం సినిమాలో కనిపించేది. అదే విధంగా చాలా మంది అప్ కమింగ్ హీరోల సినిమాల్లో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ కనిపిస్తుంది.
Advertisement
కానీ ఒక స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో రిఫరెన్స్ కనిపించడం చాలా అరుదు. అది కూడా ఇండస్ట్రీ లో పోటీ పడుతున్న ఇద్దరు స్టార్స్ లో ఒకరి సినిమాలో మరొకరి రిఫరెన్స్ కనిపించడం అంటే మామూలు విషయం కాదు. కానీ తాజాగా మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమాలో ఆ సీన్ కనిపించింది.
Advertisement
పవన్ మహేష్ ఇద్దరూ టాలీవుడ్ లో ఓకే రేంజ్ ఉన్న హీరోలు….కానీ సర్కారు వారి పాట సినిమాలో పవన్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ను వాడారు. సినిమాలో నటుడు సుబ్బరాజు కు ఫోన్ వచ్చినప్పుడల్లా లా లా భీమ్లా అనే రింగ్ టోన్ వినిపిస్తోంది. ఇక ఈ టోన్ రావడం తో థియేటర్ లో క్లాప్స్ వినిపిస్తున్నాయి.
ఇక థియేటర్ లో క్లాప్స్ వినిపిస్తుంటే సోషల్ మీడియాలో మాత్రం కథ వేరేగా ఉంది. సర్కారు వారి పాటలో భీమ్లా నాయక్ రింగ్ టోన్ వాడటం పై ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. దానికి కారణం మహేష్ బాబు సినిమాలో సుబ్బరాజు పై కోప్పడటమే. దాంతో కావాలనే పవన్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేసి అవమానించారా అంటూ సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. అంతే కాకుండా దర్శకుడు పరశురామ్ పై ఫైర్ అవుతున్నారు.
Also read :
సర్కారువారిపాట లో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్…ఎక్కడంటే…?
సర్కారు వారి పాటకు నెగిటివ్ రివ్యూలు రావడానికి 5 కారణాలు ఇవేనా…?