Telugu News » Blog » ఒకే సెట్ లో పవన్-బాలయ్య.. మీటింగ్ అందుకోసమేనా..?

ఒకే సెట్ లో పవన్-బాలయ్య.. మీటింగ్ అందుకోసమేనా..?

by Anji
Published: Last Updated on
Ads

నందమూరి నటసింహం బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై ఎప్పుడు కనిపిస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకి పవన్ గెస్ట్ గా రాబోతున్నారని ప్రచారం కొనసాగింది. ఆ షోకి పవన్ ఎప్పుడూ వస్తారా వీరిద్దరూ కలిసి ఎలా సందడి చేస్తారా అని ఆసక్తితో ఎదురుచూడడం ప్రారంభించారు. తాజాగా ఈ ప్రచారానికి బలం చేకూర్చేవిధంగా అభిమానులకు డబుల్ ధమాకా అందించారు. వీరిద్దరూ కలిసి ఒకే చోట సందడి చేశారు. 

Advertisement

బాలయ్య హీరోగా నటించిన వీరసింహారెడ్డి సెట్ లో పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ని మర్యాద పూర్వకంగా కలిశారు. వీరసింహారెడ్డిలోని చివరి పాట షూటింగ్, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే జరుగుతోంది. ఈతరుణంలనే పవన్ కళ్యాణ్ బాలకృష్ణను కలిసారు. వీరిద్దరూ కలిసి కాసేపు ముచ్చటించారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన అభిమానులు జై బాలయ్య, జైపవర్ స్టార్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు బాలయ్య అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ వస్తాడనడానికి వీరిద్దరూ కలిసి ఉన్న ఈ ఫోటో సంకేతమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 

Advertisement

Also Read : టాప్ 3 నుంచి టాప్ 10 కి పడిపోయిన అనసూయ.. ఎందుకో తెలుసా ?

Manam News

ఇక బాలయ్య అన్ స్టాపబుల్ షో విషయానికొస్తే.. వీరిద్దరూ కలిసి ఒకే వేదికపై కనిపిస్తే ఎలా ఉంటుందనే ఉత్కంఠ ఆడియెన్స్ లో నెలకొంది. వీరిద్దరి మధ్య రాజకీయాల చర్చ ఏ విధంగా ఉంటుంది..? పవన్ వ్యక్తి గత జీవితం గురించి బాలయ్య ఎలాంటి ప్రశ్నలు వేస్తారు ? అని అభిమానుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఈ ఎపిసోడ్ కి హాజరుకాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ లో బిగ్ సర్ ప్రైజ్ కూడా ఉండబోతున్నట్టు తెలస్తోంది. షో మధ్యలో బాలకృష్ణ-చిరంజీవి మధ్య ఫోన్ సంభాషణ కూడా ఉండనున్నట్టు తెలుస్తోంది. పవన్ ని ఆటపట్టించే విషయాలన్నింటిని బాలయ్య చిరుని అడిగి తెలుసుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఉంటుందో ఉండదో తెలియదు కానీ.. ఈ ప్రశ్నలు మాత్రం ఆడియన్స్ కి  ఆసక్తిని కలిగించడం విశేషం.

Advertisement

Also Read :  అందుకే విడాకులు తీసుకున్నా, ప్రేమ‌కోసం తపిస్తున్నా….న‌టి కరాటే క‌ళ్యాణి షాకింగ్ కామెంట్స్..!